ఓటమి తర్వాత అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రాజధాని మార్పు అంటూ జగన్ ప్రకటన చేసిన తర్వాత అనూహ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయనకు బలమైన రాజకీయ కుటుంబాలు గుడ్ బాయ్ చెప్పే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. త్వరలోనే సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత అనంతపురం జిల్లా సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఆయన్ను పోలీసులు స్టేషన్ లో ఉంచి కూడా ఇబ్బందులు పెట్టారు. ఆయన బస్సులను సీజ్ చేస్తున్నారు. అయినా సరే చంద్రబాబు నుంచి మాత్రం జేసీకి సరైన మద్దతు లభించడం లేదనే అభిప్రాయం రాష్ట్ర పార్టీ నేతల్లో, జిల్లా నాయకుల్లో వినపడుతుంది. కనీసం ఇంత జరుగుతున్నా సరే కనీసం న్యాయ సహాయం అందిచడం లేదట.
అలాగే పరిటాల కుటుంబం కూడా ఇబ్బందులు పడుతుందని సమాచారం. వాళ్ళను కూడా చంద్రబాబు లైట్ తీసుకున్నారట. కేయీ కుటుంబం విషయంలో కూడా ఇదే జరుగుతుందని తెలుగుదేశం నేతలే అంటున్నారు. వీళ్ళందరూ త్వరలోనే కొందరు బీజేపీలో మరి కొందరు వైసీపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారట. వీళ్ళు మారితే మాత్రం రాయలసీమలో పార్టీ కోలుకోవడం దాదాపుగా అసాద్యం.