ఇంట్లో, బయట ఎలా ఉన్నా ఆఫీసుకు వచ్చేసరికి అబ్బా ఉక్కపోస్తుందని ఏసీ వేయండంటూ హల్‌చల్ చేస్తుంటారు. తక్కువ ఉష్ణోగ్రత పెట్టి పక్కనవారికి ఇబ్బంది కలిగిస్తుంటారు కొంతమంది. ఏసీ ఎక్కువగా ఉండడం ఉండడం వల్ల వారికి బాగానే ఉంటుంది. మహిళలకు మాత్రం ఇబ్బంది కలుగుతుందని పరిశోదనలో వెల్లడైంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల మహిళలకు, పురుషులకు ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోండి.
ఈ రోజుల్లో మహిళలు, పరుషులకు సమానంగా పోటీపడుతున్నారు. పురుషులు చేసే పనిలు చేస్తూ వారి గట్టి పోటీగా నిలుస్తున్నారు. ఇక ఆఫీసుల్లో అయితే మహిళలు ఉన్నత స్థానాలు దక్కించుకొని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోటులను అదిగమిస్తున్నారు. లైంగిక వేధింపులు, చీత్కారాలు, ఒత్తిడి ఇలా ఒకటేమిటి అడుగడుగా ఇబ్బందులు పడుతునే ఉంటారు. ఇవీన్న ఒకత్తెయితే మరో సమస్య మహిళలను వేధిస్తుంది. అదే వాతావరణం. బయట వాతావరణం ఎలా ఉన్న లోపలికి రాగానే పురుషులు ఏసీ తక్కవ ఉష్ణోగ్రత పెట్టి వారు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. దీంతో మహిళలు ఇబ్బందికి గురవుతున్నారు. సాధారణంగా పురుషులు చల్లటి వాతావరణాన్ని ఇష్టపడుతారు. మహిళలకు అలా ఉండదు. వాతావరణం కాస్త చల్లబడితేనే వణికిపోతుంటారు. అందుకనే కాస్త వేడిగా ఉంటేనే సౌకర్యంగా ఫీలవుతారు.
తాజాగా చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని బయటపెట్టారు నిపుణులు. ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మహిళల పనితీరు మెరుగ్గా ఉన్నదని, చల్లగా ఉన్న ప్రదేశంలో పురుషుల పనీతీర బాగుందని తెలిసింది. ఈ అధ్యయనం కోసం 500 మంది స్త్రీ, పురుషులను 24 టీమ్‌లుగా విభజింజి వివిధ గదుల్లో ఉంచారు. అందులో 61-91 ఫారెన్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత మారుస్తూ వారి పనితీరును అంచనా వేశారు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మహిళలు చురుగ్గా పనులు చేసుకోగా చల్లగా మారినప్పుడు పురుషుల పని సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు. మహిళలు సాధారణంగా 77 ఫారెన్ డిగ్రీల వాతావరణంలో సౌకర్యంగా ఉంటున్నారు. పురుషులు 72 ఫారెన్ డిగ్రీల ఉష్ణోగ్రతను ఇష్టపడుతున్నారని తేలింది. ఈ మార్పుకు కారణం స్త్రీలు ధరించే దుస్తులు. పలుచగా ఉన్న దుస్తులు ధరించడం వల్ల కూడా శరీరానికి చల్లదనం తాకుతుంటుంది. మగవాళ్లు వేసుకునే జీన్స్ దుస్తుల కారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ వారికి వెచ్చగానే ఉంటుంది.