గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కి ప్ర‌స్తుతం ఏడాదికి ల‌భిస్తున్న వేత‌నం ఎంతో తెలుసా..?

-

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ ఈ మ‌ధ్యే గూగుల్ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్‌కు సీఈవో అయిన సంగ‌తి తెలిసిందే. అయితే సుంద‌ర్ పిచాయ్‌కు నిజంగా ఇది క‌త్తి మీద సాములాంటి ప‌నే అయినా.. ప‌ని మాట అటుంచితే ఆయ‌న పెద్ద మొత్తంలోనే వేత‌నం అందుకోనున్నారు. ఏడాదికి ఆయ‌న‌కు అన్నీ క‌లిపి ప్ర‌స్తుతం 242 మిలియ‌న్‌ డాల‌ర్ల వేత‌నం ల‌భిస్తోంది. కేవ‌లం శాల‌రీని మాత్ర‌మే తీసుకుంటే 2 మిలియ‌న్ డాల‌ర్లు పిచాయ్‌కు ల‌భిస్తుండ‌గా, మిగిలిన అన్ని భ‌త్యాలు క‌లుపుకుని ఆయన‌కు ఏడాదికి ఏకంగా 242 మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపుగా రూ.1721 కోట్లు) వేత‌నం అంద‌నుంది.

సుంద‌ర్ పిచాయ్ 120, 120 మొత్తం క‌లిపి 240 మిలియ‌న్ డాల‌ర్ల వేత‌నాన్ని షేర్ల రూపంలో అందుకోనున్నారు. ఇక మిగిలిన మొత్తాన్ని శాల‌రీగా తీసుకోనున్నారు. కాగా 2014లో గూగుల్ సీఈవోగా పిచాయ్ నియామ‌క‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నకు షేర్ల ద్వారా ఇచ్చిన వేత‌నంతో ఆయ‌న 550 మిలియ‌న్ డాల‌ర్ల‌ను సంపాదించారు. ఇక ప్ర‌స్తుతం శాల‌రీ ప్యాకేజ్‌లో ఇస్తున్న షేర్లు వ‌చ్చే ఏడాది మార్చి 25వ తేదీ వ‌ర‌కు మెచూర్ కానున్నాయి. దీంతో 240 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన షేర్ల‌ను పిచాయ్ మార్చి నెల‌లో జీతంగా అందుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version