మనకి అరటి పండ్లు అన్ని కాలాల్లోనూ దొరుకుతాయి. అలానే అరటిపండ్లలో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. పూర్వ కాలం నుండి కూడా అరటిపండ్లని తీసుకొని చాలా బెనిఫిట్స్ మనం పొందవచ్చు అని పెద్దలు చెబుతూనే ఉన్నారు.
అరటి పండ్లు నిజంగా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అరటి పండ్లలో విటమిన్ బి 6, విటమిన్ సి, డైటరీ ఫైబర్ మొదలైనవి ఉంటాయి. అయితే అరటి పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
అరటి పండ్లలో విటమిన్ బి6 ఉంటుంది:
అరటి పండ్లలో విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. గర్భిణీలు అరటి పండ్లు తీసుకోవడం వల్ల శిశువుల బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది:
అరటిపండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది. అదే విధంగా ఇతర ప్రయోజనాలు మరెన్నో పొందొచ్చు.
అరటి పండ్లలో పొటాషియం ఉంటుంది:
అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీపీని కూడా అరటిపండ్లు కంట్రోల్లో ఉంచుతాయి. దీనితో బీపీ కూడా తగ్గుతుంది.
చర్మానికి మంచిది:
అరటి పండ్లు తీసుకోవడం వల్ల చర్మానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఎనర్జీని ఇస్తుంది:
అరటి పండ్లు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి మనకి లభిస్తుంది. అరటిపండ్లలో సుక్రోస్, ఫ్రక్టోజ్, గ్లూకోస్ ఉంటాయి పిల్లలకి మరియు అథ్లెట్స్ కి అల్పాహారం సమయంలో స్నాక్స్ సమయంలో అరటి పండ్లు ఇస్తే ఎనర్జీ పెరుగుతుంది అలానే ఫోకస్ కూడా పెరుగుతుంది ఇలా ఎన్ని లాభాలు మనం అరటి పండ్లతో పొందొచ్చు.