గర్భిణీలకు కుంకుమపువ్వు ( saffron for pregnant women ) వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ధర ఎక్కువైనప్పటికీ కలిగే ప్రయోజనాలు ఎన్నో.. వివిధ రకాల ఆయుర్వేద ఔషధం లో కూడా చాలా సంవత్సరాల నుండి వాడుతున్నారు. కుంకుమ పువ్వు లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అదే విధంగా శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ వంటి సమస్యలని దరిచేరకుండా చూసుకుంటుంది కుంకుమ పువ్వు. అలానే ఇంకా ఎన్నో ప్రయోజనాలు కుంకుమపువ్వు ద్వారా మనం పొందొచ్చు. ముఖ్యంగా గర్భిణీలకు కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. అయితే గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం.
మూడ్ స్వింగ్స్:
మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేయడానికి కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గర్భిణీలు తొమ్మిదో నెల వచ్చే సరికి ఎక్కువ మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. హార్మోనల్ మార్పులు మొదలైన మార్పులు కారణంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అటువంటి సమయంలో కుంకుమ పువ్వు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది.
మంచి నిద్ర పొందొచ్చు
గర్భిణీలు మంచి నిద్ర పొందడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. యాంగ్జైటీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. కనుక రెగ్యులర్ గా గర్భిణీలు కుంకుమపువ్వు తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.
హై బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది:
కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. కనుక గర్భిణీలు తప్పకుండా కుంకుమ పువ్వును ఉపయోగించడం మంచిది.
అలర్జీలు రాకుండా చూస్తుంది:
అలర్జీలు రాకుండా కుంకుమ పువ్వు చూసుకుంటుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది. ఇలా కుంకుమ పువ్వుతో గర్భిణిలు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.