డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ?

-

బ్రౌన్ రైస్ ( brown rice ) అనేది ధాన్యం జాతికి చెందిన‌ది. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వైట్ రైస్‌కు బ‌దులుగా బ్రౌన్ రైస్‌ను తింటున్నారు. బ్రౌన్ రైస్ అంటే ముడిబియ్యం. వ‌డ్ల‌ను మ‌ర‌లో ఆడించిన త‌రువాత పాలిష్ చేయ‌కుండా అలాగే ఉంచుతారు. ఆ బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. అయితే డయాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు బ్రౌన్ రైస్‌ను తిన‌వ‌చ్చా ? అంటే.. ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Brown Rice | బ్రౌన్ రైస్‌

పోష‌కాల ప‌రంగా చూస్తే వైట్ రైస్ క‌న్నా బ్రౌన్ రైస్‌లోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌లో ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌రల్స్ అధికంగా ఉంటాయి. కానీ వైట్ రైస్‌లో ఈ పోష‌కాలు ఉండ‌వు. అందువ‌ల్ల పోష‌కాల ప‌రంగా చెప్పాలంటే బ్రౌన్ రైస్ అత్యుత్త‌మ‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక బ్రౌన్ రైస్ ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. బ్రౌన్ రైస్ లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, మాంగ‌నీస్‌, విట‌మిన్లు బి1, బి3, బి5, బి6. కాప‌ర్‌, సెలీనియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్ అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ పోష‌ణ‌ను అందిస్తాయి. బ్రౌన్ రైస్ లో రైబో ఫ్లేవిన్‌, ఐర‌న్‌, పొటాషియం, ఫోలేట్ ఉంటాయి. అందువ‌ల్ల బ్రౌన్ రైస్ ను పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు.

బ్రౌన్ రైస్ గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా వైట్ రైస్ క‌న్నా త‌క్కువే. బ్రౌన్ రైస్ జీఐ విలువ 68 గా ఉంది. వైట్ రైస్ జీఐ విలువ 73గా ఉంది. అందువ‌ల్ల బ్రౌన్ రైస్ ను తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అంత త్వ‌రగా పెర‌గ‌వు. కాబ‌ట్టి డ‌యాబెటిస్ ఉన్న‌వారికి బ్రౌన్ రైస్ ఉత్త‌మ‌మ‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు.

ఇక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న కొంద‌రికి రోజూ బ్రౌన్ రైస్ ఇచ్చి చూడ‌గా వారిలో వైట్ రైస్ తినేవారితో పోలిస్తే షుగ‌ర్ లెవ‌ల్స్‌, హెచ్‌బీఎ1సి లెవ‌ల్స్ చాలా వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారు బ్రౌన్ రైస్ ను తిన‌డం మంచిది. బ్రౌన్ రైస్‌ని తిన‌డం మొద‌ట్లో కొంచెం క‌ష్టంగా అనిపిస్తుంది. సో బ్రౌన్ రైస్‌తో రుచిక‌ర‌మైన‌ రెసిపీస్ చేసుకుని తింటే అల‌వాటుగా మారుతుంది.

మష్రూమ్ బ్రౌన్ రైస్

Mushroom Brown Rice | మష్రూమ్ బ్రౌన్ రైస్ రెసిపీ

బ్రౌన్ రైస్‌తో మ‌ష్రూమ్స్ కాంబినేష‌న్ అదిరిపోతుంది. అందరు ఇష్టపడే ఈ మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. మష్రూమ్ బ్రౌన్ రైస్ రెసిపీ.

బరువు నుండి షుగర్ వరకు ఎన్నో సమస్యలని జొన్న రొట్టెల‌తో కంట్రోల్ 
బ్రౌన్ రైస్, వైట్ రైస్.. రెండింటిలో ఏది మంచిది

Read more RELATED
Recommended to you

Exit mobile version