గర్భిణీలు పసుపు వేసిన పాలు తీసుకోవచ్చా..? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారు అంటే..!

-

గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. చాలా మంది గర్భిణీలు చేసే తప్పేంటంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని నచ్చిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. గర్భిణీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పక తీసుకోవాలి కాబట్టి తప్పులను అస్సలు చేయరాదు. ఏదైనా సందేహం ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే తీసుకుంటూ ఉండాలి.

ఇది ఇలా ఉంటే చాలామంది గర్భిణీల్లో ఉండే సందేహం ఏమిటి అంటే పసుపు కలిపిన పాలన గర్భిణీలు తీసుకోవచ్చా లేదా అని… మామూలు సమయంలో పసుపు కలిపిన పాలను తీసుకోవడం వలన చక్కటి లాభాలను మనం పొందవచ్చు. రకరకాల సమస్యల నుండి బయట పడేస్తుంది. ఇక ఈ విషయం పై ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారనేది చూస్తే… గర్భిణీలు పసుపు కలిపిన పాలు తీసుకోవచ్చు. సురక్షితమే. ఎటువంటి సమస్య వుండవు.

కానీ ఎప్పుడూ కూడా లిమిట్ గానే తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. పసుపులో కరిక్యుమిన్ ఉంటుంది. అలానే ఇందులో యాంటీ బాక్ట్రయల్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి పాలల్లో పసుపు కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు ఉండవు బ్లోటింగ్ గ్యాస్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. బ్యాక్టీరియల్ సమస్యల నుండి కూడా ఇది దూరం చేస్తుంది. ప్రీ క్లాంప్సియా అనే సమస్య నుండి కూడా ఇది దూరం చేస్తుంది. ఇది గర్భిణీలకు 20 వ వారంలో ఎదురవుతుంది. గర్భిణీలూ చూశారు కదా ఈ విషయాన్ని జాగ్రత్తగా లిమిట్ గా తీసుకుంటూ ఉండండి అధికంగా తీసుకుంటే ఇబ్బందులు పడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version