దేశానికో రంగు అన్నట్టుగా తెల్లోళ్లు, నళ్లోల్లని మనం పెట్టుకోవడం కాదు ఆయా ప్రాంత పరిస్థితులను బట్టి మనుషుల చర్మ రంగు ఆధారపడి ఉంటుంది. అయితే ప్రపంచదేశాలతో పోల్చితే చైనాలో మగవాళ్లు, ఆడవాళ్లు చాలా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లు అయితే ఎంతో తెల్లగా ఉంటారు. ఆ తెల్లటి రంగు రహస్యం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.
ప్రపంచ దేశాలతో పోల్చితే జపాన్ మరియు చైనాల్లో మాత్రం అధిక శాతం మంది తెల్లగా ఉంటారు. అయితే అక్కడ వారు తెల్లగా కనిపించడానికి రెగ్యులర్ పనిలో కొన్ని బ్యూటీ టిప్స్ కూడా వాడుతారని తెలుస్తుంది. చైనా దేశంలో ఆడ మగ అనే తేడా లేకుండా నెలలో కనీసం ఒకటి రెండు సార్లు అయినా మసాజ్ చేయించుకుంటారట. మసాజ్ చేయించుకోవడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు, ఫేస్ గ్లో నెస్ వస్తుందని నిపుణులు అంటున్నారు.
అంతేకాదు అక్కడ ఎక్కువ గ్రీన్ టీ తాగుతారని తెలుస్తుంది.. అసలు గ్రీన్ టీ ఆచారం అక్కడ నుండే వచ్చిందని అంటున్నారు. కాఫీ మరియు సాదారణ టీ కంటే 10 రెట్టు అధికంగా గ్రీన్ టీ వాడుతారట. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంగాతో పాటుగా, అందంగా కూడా కనిపిస్తారని తెలుస్తుంది. మన దగ్గర పెసలు కేవలం గారెలకు, దోశలకు, మిగతా పిండి వంటలకు వాడుతారు. కాని చైనాలో మాత్రం ఫేస్ ప్యాక్‌గా వినియోగిస్తారు. పెసర్ల పేస్ట్‌ను ఫేస్‌కు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫేస్ చాలా ఫ్రెష్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇలా కొన్ని ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చైనా, జపాన్ లో వారు అందంగా తెల్లగా ఉంటారని చెబుతున్నారు.