చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా కనుక చేశారంటే మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడచ్చు. చాలా మంది తరచుగా బాధపడే సమస్య ఇది. మలబద్ధకం వలన కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి జంక్ ఫుడ్ ని తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, నీళ్లు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఇలా అనేక కారణాల వలన మలబద్ధకం సమస్య వస్తుంది.
రాత్రిపూట ఆలస్యంగా తింటే కూడా మలబద్ధకం సమస్య ఉంటుంది. మలబద్ధకం నుండి బయట పడాలంటే ఈ పండ్లను తీసుకోండి. అరటి పండ్లని తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు. అరటిపండ్లలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ పేగు కదలికని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం ఇస్తుంది. కమల పండ్లలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మలబద్దకానికి సహాయపడుతుంది. కివిని తీసుకుంటే కూడా మలబద్ధకం సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు.
ఆపిల్ పండ్లను తీసుకుంటే కూడా మలబద్ధకం సమస్య ఉండదు, బొప్పాయి పండ్లను తీసుకుంటే కూడా మలబద్ధకం సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు. పియర్స్ లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మలబద్దకాన్ని దూరం చేస్తుంది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇలా ఈ పండ్లను డైట్ లో చేర్చుకోండి అప్పుడు మలబద్ధకం సమస్య ఉండదు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇబ్బంది ఏమీ ఉండదు.