హైబీపీని కంట్రోల్ లో ఉంచే అద్భుతమైన చిట్కాలు..

-

హైబీపీ.. ప్రస్తుత పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య హైబీపీ. గుండె నుండి రక్తాన్ని పంపు చేసే పద్దతిలో మార్పు రావడమే హైబీపీ. ఆరోగ్యవంతుడైన మానవునికి సాధారణ రక్తపీడనం 120/80గా ఉంటుంది. 120ని సిస్టోలిక్ అనీ, 80ని డయాస్టోలిక్ అని అంటారు. ఐతే రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేక అనారోగ్య ఇబ్బందులకి కారణం అవుతుంది. అందుకే హైబీపీని అదుపులో ఉంచడానికి కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం.

సరైన ఉప్పు

మీరు తినే ఉప్పులో సోడియంతో పాటు పొటాషియం ఉండేలా చూసుకోండి. కొన్ని ఉప్పు రకాల్లో సోడియం మాత్రమే ఉంటుంది. అందుకే రాతి ఉప్పు, బ్లాక్ సాల్ట్ వంటివి వాడితే బెటర్.

ప్యాకేజీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు.

వీటివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. అందువల్ల సోడియం, పొటాషియం లెవెల్స్ లో సమతుల్యం దెబ్బతింటుంది. అది రక్తపీడనంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.

అప్పడాలు వంటివి తినండి..

అప్పడాల్లో పప్పుధాన్యాలు బాగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జీలకర్ర, నల్లమిరియాలు కలిసిన అప్పడాలు హైబీపీని కంట్రోల్ లో ఉంచుతాయి.

సరైన నిద్ర

హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే సరైన నిద్ర అవసరం. రోజుకి 6నుండి 8గంటలు నిద్ర చాలా అవసరం. సరైన సమయానికి సరిగ్గా నిద్రపోతే మీ బీపీ అదుపులో ఉంటుంది.

వ్యాయామం

రోజూ పొద్దున్న లేచి వ్యాయామం చేయడం అస్సలు మర్చిపోవద్దు. వ్యాయామం వల్ల బీపీ నియంత్రణలోకి వస్తుంది. పై విషయాలు గుర్తుపెట్టుకుని పాటిస్తే మీ హైబీపీని నియంత్రణలోకి తీసుకురావచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version