రోజూ దీనిని తీసుకుంటే… షుగర్ పరార్..!

-

ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. రోగనిరోధక శక్తి తగ్గింది అంటే చాలా రకాల సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే. వానా కాలంలో అయితే మరీ ఎక్కువ సమస్యలు వస్తాయి. సీజనల్ సమస్యల నుంచి భయంకరమైన అనారోగ్య సమస్యల వరకు చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని కంట్రోల్ చేయడానికి చాలామంది మందుల్ని వాడుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే చాలా సమస్యలు దూరం అవుతాయి అందులో గంజి ఒకటి. గంజి చాలా ఆరోగ్యకరమైనది. గంజి వలన షుగర్ మొదలు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.

నవారా రైస్ ని ఉపయోగిస్తే చాలా మంచిది. వీటినే రెడ్ రైస్ అని అంటారు. కేరళ రెడ్ రైస్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి12తో పాటుగా ఎన్నో పోషకాలు ఉంటాయి, వీటిలో అద్భుతమైన గుణాలు ఉంటాయి కనుక ఆయుర్వేదంలో కూడా వాడుతారు. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. ఈ నావారా బియ్యంతో గంజి తయారు చేసుకునే తాగడం వలన అద్భుతమైన ప్రయోజనాలని పొందవచ్చు. వీటిలో కొంచెం మెంతులు కూడా వేసుకోండి. మెంతులులో అద్భుతమైన గుణాలు ఉంటాయి శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. మధుమేహం, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఆడవారికి హెల్ప్ చేసే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఇందులో ఉంటుంది. ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది.

నావారా గంజిని ఎలా తయారు చేసుకోవచ్చు..?

ఈ గంజిని తయారు చేయడానికి ముందు ఒక గ్లాసు నవారా బియ్యాన్ని ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. మిక్సీలో కొద్దిగా కొబ్బరి పాలు వేయాలి. చిన్న ఉల్లిపాయ కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. వీటిని మిక్సీ పట్టాక కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, చెక్క, సాల్ట్ కూడా వేసి.. కొబ్బరి మిశ్రమాన్ని నవారా రైస్ మిశ్రమాన్ని వేసి కలపండి. ఉదయాన్నే అల్పాహారం కింద తీసుకుంటే మంచిది లేదంటే రాత్రి కూడా తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా షుగర్, ఉబకాయం, హై కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version