కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలు తీసుకుని వాటికోసం పనిచేసే అలవాటు అందరికీ ఉంటుంది. కొంతమంది తాము తీర్మానించుకున్న వాటిని మధ్యలోనే వదిలేస్తారు. వాళ్ల సంగతి పక్కన పెడితే, 2025లో బరువు తగ్గాలనుకున్న వారు.. ఆ కోరికను నెరవేర్చుకోవాలంటే కొన్ని పనులు చేయాలి.
చక్కెర అసలే వద్దు:
చక్కెర సంబ్ంధిత ఆహారాలు ముట్టుకోవద్దు. షుగర్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా పెరుగుతారు. డైలీ డైట్ లో షుగర్ ఉన్న ఆహారాలను పక్కన పెట్టండి. ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఒకవేళ తీపి తినాలన్న కోరిక తీవ్రమయితే అప్పుడప్పుడు తేనెతో సరిపెట్టండి.
పోషకాలున్న ఆహారం:
బరువు తగ్గాలన్న ఉద్దేశ్యంతో కొంతమంది ఆహారం తక్కువ తింటారు. అది సరైన చర్య కాదు. దీనివల్ల శక్తి తగ్గి నీరసంగా మారతారు. అలా కాకుండా పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు మరీ ఎక్కువ తీసుకోకుండా అన్ని పోషకాలు సమంగా ఉండే ఆహారం తినాలి.
అవకాడో, గింజలు, చియా చిత్తనాలు, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలను తినడం మంచిది.
మనస్ఫూర్తిగా తినండి:
ఏదో ఆకలయ్యింది కాబట్టి తినాలన్న ఉద్దేశ్యంతో తినవద్దు. తినడం కూడా ఒక పనే. ఆ పని శ్రద్ధగా చేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మనస్ఫూర్తిగా తింటే ఎంత తింటున్నారో అర్థమై.. ఎక్కువ తినకుండా ఆగిపోతారు.
నీళ్ళు, నిద్ర:
ఒకరోజులో ఎన్ని నీళ్ళు తాగాలో మీకు తెలియాలి. శారీరక శ్రమ ఎక్కువ చేసినట్లయితే ఎక్కువ నీళ్ళు తాగాలి. అలాగే కనీసం 7గంటలు నిద్రపోవాలి. నిద్ర లేకపోతే మీరు బరువు తగ్గలేరు.