కరోనా కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. కరోనా నుండి కోలుకున్నాక ఇటువంటి పద్ధతులు పాటిస్తే ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది.
సాధారణంగా కరోనా తగ్గిన వాళ్ళలో నీరసం, అలసట, బద్దకం మొదలైన సమస్యలు వస్తున్నాయి. అటువంటప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటివి పాటించడం ముఖ్యం. మీరు తీసుకునే ఆహారం అన్నిటి కంటే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండండి.
పోషకాహారం తీసుకోవడం వల్ల నీరసం ఉండదు. అలాగే ఆకలి పెరగడం కోసం కొద్దిగా అల్లం లో కల్లుప్పుని వేసుకుని ఆహారం తీసుకునే 15 నుండి 20 నిమిషాలు ముందు తీసుకోండి. దీని వల్ల మీకు ఆకలి పెరుగుతుంది.
అలానే మీరు వండుకునే వంటల లో జీలకర్ర పొడి, వెల్లుల్లి, మిరియాల పొడి, కొత్తిమీర, అల్లం వంటివి వాడండి. అదే విధంగా పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి పసుపు కూడా ఎక్కువగా వంటల్లో వాడుకోవచ్చు.
ఆవు నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి ఆవు నెయ్యిని కూడా వంటల్లో ఎక్కువగా వాడండి. తాజా పండ్లు కూరగాయలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక వాటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.