కోవిడ్ 19: సెకండ్ వేవ్, లాక్డౌన్ భయాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నాయా? ఈ టిప్స్ పాటించండి…

-

సెకండ్  వేవ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అన్న మాటలు ఆందోళనకి గురి చేస్తున్నాయి. మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు. అది ఉంటుందా, ఉందా అన్న సందేహాలు.. వీటన్నింటి నడుమ నిరుత్సాహం ఆవరిస్తుంది. ఏదైనా చేద్దామంటే వీలు లేకుండా నెగెటివిటీ పరుచుకుపోవడంతో నిరుత్సాహం ఆవరించి ఎనర్జీని తగ్గిస్తుంది. ఐతే ఇలా ఎన్ని రోజులు ఉంటారు. దీన్నుండి ఎలా బయటపడాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.

నిరుత్సాహాన్ని దూరం చేసేందుకు పాటించాల్సిన చిట్కాలు

ఒకరోజుని రెండు మూడు భాగాలుగా విభజించండి. ఆ భాగాల్లో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. అవి చాలా ఈజీగా చేసేవై ఉంటే బెటర్. అలా విభజించిన భాగాల్లో పనులని చేసుకుంటూ వెళ్తుంటే కొత్త ఎనర్జీ వస్తుంది.

ఒకేసారి రెండు మూడు పనులు చేయాలని అనుకోవద్దు. పనిచేసేటపుడు ఫోన్, ఎలక్ట్రానిక్ సాధనాలని పక్కన పెట్టండి. మీకు తెలియకుండానే మీ సమయాన్ని, దృష్టిని చంపేయడంలో అవి ముందుంటాయి.

మీ అభిప్రాయలను స్వేఛ్ఛగా పంచుకోండి. ఈ టైమ్ లో ఇతరులతో మాట్లాడడం చాలా ఉత్తమం. ఒంటరిగా ఉండకండి.మీ అభిప్రాయాలు పంచుకున్నట్టుగానే అవతలి వారు తమ అభిప్రాయాలను పంచుకునేలా స్వేఛ్ఛ ఇవ్వండి. ఇతరులని కొంచెం పట్టించుకోండి.

ఒక రోజులో వివిధ రకాలైన ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. వాటన్నింటినీ పెద్దగా పట్టించుకోవద్దు. రాత్రిపూట పడుకునే ముందు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతత కోసం ధ్యానం, ఏదైనా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. లాక్డౌన్ సమయం, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని కామ్ గా ఉంచుకోవడం చాలా అవసరమైనది.

Read more RELATED
Recommended to you

Exit mobile version