ఆస్త‌మాకు చెక్ పెట్టే సులువైన చిట్కాలు..! 

-

స‌హ‌జంగా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలలోను, పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం.  పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, దుమ్ము, ధూళి, వ్యాయామం, మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు.

అలాగే  శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుంచించుకపోవడం వల్ల కూడా ఆస్తమా వస్తుంది.  దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు తీసేంత‌ బాధపెడుతుంది.  ఆస్తమా వ్యాధి గ్రస్తులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వ‌హించ‌డంతో పాటు తగినంత శ్రద్ధ తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లి:

ఉల్లిపాయ‌లో  యాంటీ – ఇన్‌ప్లమేటరీ, యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడం వల్ల ‘ హిస్తమిన్‌ ‘ విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్ స్ట్ర్క్షక్షన్‌ తగ్గుతుంది.

తేనె:

ఆస్తమాను తగ్గించ‌డంతో తేనె బాగా ప‌ని చేస్తుంది. ఒక జగ్గు నిండా ఉండే తేనె ముక్కు శ్వాస రంధ్రాల‌ను శుభ్రపరుస్తుందని చాలామంది నమ్మకం. తేనె శ్వాస తీసుకోటాన్ని సులభతరం చేయ‌గ‌ల‌దు.

పాలకూర:

ఆస్త్మా లక్షణాలను తగ్గించడములో పాల‌కూర‌ బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తము లోనూ, టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి. పాల‌కూర‌లో మెగ్నీష‌యం పుష్క‌లంగా ఉంటుంది. మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వల్ల‌ ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి రెమ్మలను తీసుకొని కొన్ని పాలలో కలిపి సేవించ‌డం వల్ల స్టాటింగ్ ద‌శ‌లో ఉన్న‌ ఆస్తమాను తగ్గించవచ్చు. రోజుకి ఒక సారి దీన్ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

నిమ్మ:

నిమ్మ ర‌సంలో, తేనె కలిపిన మిశ్రమం తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఆస్తమా వ్యాధి తగ్గించేందుకు ఔషధంగా ప‌నిచేస్తుంది. ప‌్ర‌తి రోజూ నిమ్మరసాన్ని తాగటం వల్ల‌ ఆస్తమా వ్యాధితీవ్రతలు తగ్గుతాయి.

రెడ్ క్యాప్సికం:

దీనిలో  సి విటమిన్‌ ఎక్కువ . అయితే మిగతా విటమిటన్‌ సి ఉన్న ఆహారపదార్ధాలు అస్త్మాకి మంచి చేయవు . రెడ్ మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ ” ఫాస్ఫోడిల్ స్టెరేజ్ ” అనే ఎంజైమ్ ఉత్ప‌త్తిని అడ్డుకుంటుంది.

యాపిల్:

యాపిల్‌లో ఉండే ‘ ఫైటోకెమికల్స్ ‘ అస్త్మాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో ‘ లైకోఫిన్‌’ ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్షిడెంట్ గా ఆస్త‌మాకు బాగా ప‌నిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version