జనగామ ఎమ్మెల్యే.. ముత్తిరెడ్డి కాదు కబ్జారెడ్డి – వైఎస్ షర్మిల

-

జనగామ ఎమ్మెల్యే.. ముత్తిరెడ్డి కాదు కబ్జారెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. 500 ఎకరాలకు తక్కువ లేకుండా కబ్జా చేశాడట. కేసీఆర్ ఒక్క ఫామ్ హౌజ్ కట్టుకుంటే, ఈయన మూడు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నాడట. ఏ భూములూ వదలకుండా కబ్జా చేస్తాడట. కలెక్టర్ సైతం కబ్జాకోరు అని రిపోర్ట్ ఇస్తే.. కేసీఆర్ అండదండలతో ట్రాన్స్ ఫర్ చేయించాడట. అందుకే బీఆర్ఎస్ అంటే బంధిపోట్ల రాష్ట్ర సమితి అంటూ ఫైర్‌ అయ్యారు.

అసెంబ్లీలో కేసీఆర్ నిస్సుగ్గుగా వైయస్ఆర్ గురించి తప్పుడు కూతలు కూస్తున్నాడు. తెలంగాణలో జలయజ్ఞం ద్వారా 33 ప్రాజెక్టులు నిర్మించి, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత వైయస్ఆర్ గారిది అయితే కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా మూడేండ్లకే ప్రాజెక్టును ముంచిన చరిత్ర నీది. ఫామ్ హౌజ్ మత్తులో ప్రగతిభవన్ లో డాన్సులు వేస్తూ.. అసెంబ్లీలో తప్పుడు కూతలు కూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version