గుండె హెల్తీగా ఉండాలంటే.. చలికాలం ఈ 7 తప్పక తీసుకోండి..!

-

చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. చలికాలంలో వీటిని తీసుకుంటే గుండె సమస్యలు రావు. బీట్రూట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి క్యారెట్లను కూడా చలికాలం తీసుకోవడం మంచిది. క్యారెట్లలో బీటా కెరోటీన్స్ తో పాటుగా ఫైబర్, పొటాషియం ఉంటాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే వెల్లుల్లిని కూడా చలికాలంలో తీసుకోవాలి.

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. గుండె సమస్యలు రాకుండా వెల్లుల్లి చూస్తుంది. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ ఫెనాల్స్ ఉంటాయి. వీటిని తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి బాదం, వాల్నట్స్ కూడా తీసుకోండి.

వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. గుండె సమస్యలు రావు. నారింజ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నారింజ పండ్లు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆకుకూరలు కూడా తీసుకోండి. ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే కూడా గుండె హెల్తీగా ఉంటుంది. గుండె సమస్యలు రావు. పోషకాలు కూడా బెర్రీస్ లో సమృద్ధిగా ఉంటాయి. ఇలా ఈ ఆహార పదార్థాలు మీరు చలికాలంలో తీసుకుంటే గుండె సమస్యలే రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version