చక్కరను ఎక్కువగా తింటున్నారా?

-

స్వీట్స్ అంటే అందరికి ఇష్టం.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టంగా తింటారు.మన దేశంలో వచ్చే పండుగలకు ఎక్కువగా స్వీట్స్ పెట్టడం ఆనవాయితీగా మారింది..స్వీట్స్ లలో ఎక్కువగా చక్కెరను వాడుతున్నారు.. అయితే ఎక్కువగా చక్కెరను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం..అమితంగా తింటే విషం అవుతుంది..మరి చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల తో పాటుగా శృంగార సామర్థ్యం కూడా తగ్గి పోతుందని అంటున్నారు..

సాదారణంగా పొగతాగటం, మద్యం తాగే అలవాటు, పర్యావరణ విషతుల్యాలు, దీర్ఘకాలిక ఒత్తిడి శృంగారంలో ఆసక్తి తగ్గేలా చేస్తాయి.చక్కెర రక్తంలో ఇన్సులిన్ స్ధాయిలపై తీవ్రప్రభావం చూపుతుంది. శరీరంలో ఇన్సులిన్ స్ధాయిలను పెంచి హార్మోన్ల సమతుల్యతకు విఘాతం కలిగిస్తుంది.దాని వల్ల సెక్స్ పై ఆసక్తి పోతుందట..చక్కెర అధికంగా ఉండే పిండి పదార్ధాలను తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్ స్ధాయిలు పెరుగుతాయి. ఇది క్రమేపీ ఇంన్సులిన్ నిరోధకతకు దారితీసి, శృంగారంపై ఆసక్తి కలుగజేసే టెస్టోస్టిరాన్ స్ధాయిలు తగ్గేలా చేస్తాయి

కడుపులో కొవ్వు కూడా అధికంగా పెరగడం వల్ల లైంగిక వాంఛలు తగ్గుతాయి.కొవ్వు కణాలు టెష్టిన్ ఉత్పత్తి చేయటం కొనసాగిస్తున్నప్పటికీ మెదడు కంట్రోల్ తప్పుతుంది. చక్కెర లోని కారకాలు కొవ్వును అధికంగా పెంచుతుంది..దాని వల్ల ఆసక్తిగా ఎటువంటి పని చేయలేరు.ఆకలి మందగిస్తుంది.ఆహారం, అలవాట్లను , చురుకుదనాన్ని నియంత్రించే హార్మోన్ పనితీరును చక్కెర దెబ్బతీస్తుంది.అందుకే చురుగ్గా పని చేయలేరు..శృంగారం పై అస్సలు ఆసక్తి ఉండదు..అందుకే చక్కెరకు వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version