బడ్జెట్ 2024 సమావేశాలు ఎల్లుండి (జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి. 2024-2025కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న ఉదయం 11:00 గంటలకు పార్లమెంట్లో సమర్పించనున్నారు. అంతకంటే ముందు జూలై 22న ఎకనమిక్ సర్వే రిలీజ్ చేస్తారు.
ఇప్పటికే 2024-25 బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరుకుంది.లోక్సభలో ఆర్థికమంత్రి సీతారామన్ ఈ నెల 23వ తేదీన మోడీ 3.0 ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముడి పదార్థాలపై సుంకాలను తగ్గించడం ,లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత సంవత్సరం నుంచి 2 లేదా 3 సంవత్సరాలకు పొడిగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.