ప్రతి ఒక్కరు కూడా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కుటుంబ పరంగా, సమాజపరంగా వివిధ రకాల ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం సహజమే వాటి వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజుల్లో చాలామంది వాటిని అర్థం చేసుకోవట్లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మారుస్తున్నారు. ఒకరిని చూసి ఇంకొకరు గుడ్డిగా పాటిస్తూ అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు పిల్లలకు ఏ విషయాలు నేర్పించాలి అనుకుంటున్నారో వాటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. తర్వాత పిల్లలకు నేర్పించడం వలన ఆచారాలు సంప్రదాయాలు వలన కలిగే లాభాలు ఏంటో వాళ్ళు గ్రహిస్తారు.
గ్రంధాలు, పురాణాలు మొదలైన వాటిలో ఉండే వివిధ అంశాల గురించి పిల్లలకు చెప్పండి. చిన్న కథల రూపంలో పిల్లలకు చెప్పడం వలన ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. జీవితంలో వచ్చే ఎత్తు పల్లాలను ఎలా ఎదుర్కోవాలి. ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది పిల్లలకు నేర్పాలి. అలాగే పిల్లలు విషయంలో మీరు కొన్ని తప్పులు చేయకూడదు. మంచి అలవాట్లను మీరు పాటిస్తూ వారు కూడా పాటించేటట్టు చేయాలి.
అప్పుడే వాళ్ళు ఆధ్యాత్మికతను అసలైన అర్థం ఏంటో తెలుసుకోగలుగుతారు. అలాగే ధ్యానం ఎంతో ముఖ్యమైనది. పిల్లలకు ధ్యానం చేసే విధంగా ప్రోత్సహించండి. దీని వలన ఆధ్యాత్మిక భావన కలగడంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. పిల్లలకు చదువుకునే వయసులో ఆధ్యాత్మిక చింతనను అలవరిస్తే వారు మంచి విజయాలని సొంతం చేసుకుంటారు. ఆధ్యాత్మికతను అలవాటు చేసే క్రమంలో చదువుకే భంగం కలగకుండా చూసుకోండి. ఇలా మీరు మీ పిల్లలకి కనుక వీటిని నేర్పించారంటే కచ్చితంగా మీ పిల్లలు భవిష్యత్తులో మంచి బాట పడతారు.