కేంద్ర క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నిన్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. హర్యానాలో విజయం సాధించిన తెల్లారే కేంద్రం క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యూటీషియన్ సెక్యూరిటీ.. 17,082 కోట్లు కేటాయించింది. మహిళలు, పిల్లల్లో న్యూట్రిషన్ సమస్యలను అధిగమించేందుకు నిర్ణయం తీసుకుంది.
80 కోట్ల మందికి న్యూట్రీషియన్ సెక్యూరిటీ ద్వారా లబ్ధి చేకూరనుంది. 17,082 కోట్లతో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐసీడీఎస్, పీఎం పోషన్ సహా అన్ని పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా చేయనున్నట్టు తెలిపింది. రక్త హీనత, శరీరంలో మైక్రో-న్యూట్రియంట్ల కొరతను అధిగమించడమే లక్ష్యం అన్నారు. 2024 జులై నుంచి 2028 డిసెంబర్ వరకు అమలుకానున్నది ఈ పథకం. పూర్తిగా 100% కేంద్ర నిధులతోనే పథకం అమలు కానుంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ప్రయోజనం, పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశముంది.