తినకముందు షుగర్‌ లెవల్స్‌ 450 ఉన్నా.. ఈ పండు తిన్నారంటే 99కి వచ్చేస్తుంది..!

-

అవకాడో..ఈ పండు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ తినే వాళ్లు తక్కువ.. ఇది ఎన్నోరోగాలకు దివ్యఔషధం లాంటిదే.. ముఖ్యంగా షుగర్‌ బాధితులతు అయితే వరమనే చెప్పాలి.. మీ షుగర్‌ లెవల్స్‌ ఎంత ఎక్కువగా ఉన్నాసరే.. ఈ పండును తిన్నారంటే.. క్రమంగా తగ్గిపోతాయి. కొంతమందికి తినకముందే షుగర్‌ 450 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తిన్నారంటే.. కొద్దిరోజుల్లోనే.. 99కి వచ్చేస్తుంది..
అవ‌కాడోలలో అతి త‌క్కువ కార్బొహైడ్రేట్లు ఉంటాయి. 100 గ్రాముల అవ‌కాడోలో కేవ‌లం 0.8 గ్రాముల పిండి ప‌దార్థాలు మాత్ర‌మే ఉంటాయి. పిండిపదార్థాలు లేని ఆహారం షుగ‌ర్ ఉన్న‌వాళ్ల‌కు చాలా మంచిది. ఇక ఈ పండులో 100 గ్రాములకు 23 గ్రాముల ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. కొవ్వులు ఉండే ఏకైక పండు ఇదే.
అవ‌కాడోను 100 గ్రాముల మేర తింటే 7 గ్రాముల ఫైబ‌ర్ ల‌భిస్తుంది. డ‌యాబెటిస్‌ను త‌గ్గించ‌డంలో అవ‌కాడోల్లోని కొవ్వుల‌తోపాటు ఫైబ‌ర్ కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే 2 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఇవ‌న్నీ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అమాంతం త‌గ్గించేస్తాయి.
ఉద‌యం అవ‌కాడో పండును 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. దాన్ని బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు తినాలి. దీంతో అందులో ఫైబ‌ర్ క‌డుపు నిండినట్లు చేస్తుంది.. ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి. రోజూ ఈ విధంగా ఈ పండును తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. టైప్ 1, 2 డ‌యాబెటిస్ ఇద్దరికీ ఈ పండు మంచిదే..
అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల నీరసం త‌గ్గుతుంది. పిండి ప‌దార్థాలు అత్యంత త‌క్కువ‌గా ఉంటాయి, కొవ్వులు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక శ‌క్తికి ల‌భిస్తుంది. పైగా షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. శ‌రీరం దృఢంగా మారుతుంది. కండ‌రాలు దృఢంగా ఉంటాయి.
ఉద‌యం పూట నాలుగు రకాల మొల‌కెత్తిన విత్త‌నాలు, అవ‌కాడో తింటే షుగ‌ర్ ఎంత ఉన్నా వెంట‌నే త‌గ్గుతుంది. 400కు పైగా ఉండే షుగ‌ర్ కూడా 100 లోపు వ‌చ్చేస్తుంది. అలాగే సాయంత్రం డిన్న‌ర్‌లో న‌ట్స్ తింటే దాంతోపాటు అవ‌కాడో తీసుకోవ‌చ్చు.
అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. అందుక‌నే షుగ‌ర్ లెవ‌ల్స్ బాగా త‌గ్గుతాయి. అందువ‌ల్లే డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఈ పండు ఎంత‌గానో మేలు చేస్తుంది.
అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల ఇంకో లాభం కూడా ఉంది.. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) కూడా త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. దీంతో గుండె జ‌బ్బులు వచ్చే ప్రమాదం తగ్గించుకోవచ్చు.

ఎలా తినొచ్చు..

అవ‌కాడోను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి నేరుగా అలాగే తీసుకోవచ్చు. పైన కొద్దిగా సైంధ‌వ ల‌వ‌ణం, మిరియాల పొడి వంటివి చ‌ల్లి తీసుకుంటే ఇంకా మంచిది. వాటిని స‌లాడ్స్, శాండ్‌విచ్‌లు, జ్యూస్‌ల‌లోనూ తీసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version