ఫిట్‌గా ఉండేందుకు ‘ క్యాండిల్ మ‌సాజ్‌ ‘

-

స‌హ‌జంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం, ముఖంలో మార్పులు వ‌స్తుంటాయి. ఈ మార్పులు పురుషుల్లో కన్నా స్త్రీలలో త్వరగా కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖంపై ముడతలు ,మొటిమలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, శరీరం వ‌దులుగా తయారవ్వడం వంటి సాధారణ లక్షణాలు క‌నిపిస్తుంటాయి. పెరుగుతున్న వయస్సును ఆపలేక అద్దంలో ముఖం చూసినప్పుడల్లా బాధపడుతుంటారు. నిజానికి వయసును తగ్గించుకోలేకపోవచ్చు కానీ.. మార్పులను మాత్రం కొంత కాలం అదుపు చేయవచ్చు.


ముఖాన్ని నిగారింపుగా, శరీరం యవ్వనంగా ఉండేలా చూసుకోవచ్చు. ఇదంతా కూడా క్యాండిల్ మసాజ్‌తో సాధ్యమవుతుంది. ఈ కాండిల్ లైట్ మసాజ్ ఈనాటిది కాదు. రాజుల కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్నదు. అప్పట్లో మసాజ్ సెంటర్లు ఉండేవి కాదు కాబట్టి వారు ఇంట్లో ఉండే కొవ్వొత్తులతో వ్యాక్స్ థెర‌ఫీలు చేసుకునేవారు. మ‌రి ఇది ఎలా చేసుకోవాలి తెలుసుకోండి.. ఈ థెరఫీలో మైనంను క‌రిగించి శరీరంలోని భాగాలపై వేసి మసాజ్ చేసుకోవాలి.

ఈ మసాజ్ లో భాగంగా స్టీమ్ బాత్‌ చేయాల్సి ఉంటుంది. ముందుగా స్టీమ్ బాత్ ద్వారా శరీరం పై ఉన్న మలినాల‌న్నింటిని కూడా తొలగించాలి. ఆ తర్వాత‌ శరీరాన్ని పూర్తిగా హాట్ టవల్‌తో చుట్టి ఉంచాలి. దీంతో చర్మంపై ఉన్న మృతకణాలు అన్ని తొలగుతాయి. చర్మం తేమను సంతరించుకుంటుంది. ఇప్పుడు చర్మానికి బ్రైట‌నింగ్ ప్యాక్ ను వేయాలి. జలుబు, తలనొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మసాజ్ చికిత్స వలే పనిచేస్తుంది. వీటితో నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

క్యాండిల్స్‌లో రకరకాల సువాసనలు ఉంటాయి. దీనిలో లావెండర్ ఎసెన్స్ ఆయిల్, కోకా బట్టర్ ఆయిల్,రోజ్‌మేరీ అయిల్‌, లెమెన్ అరోమా క్యాండిల్స్‌, జోజోబా ఆయిల్ వంటి ప‌రిమ‌ళాల్లో కూడా ఉంటాయి. వీటిలో మసాజ్ చేయడం వల్ల శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేయవచ్చు. ఈ మ‌సాజ్‌కు చిన్న పిల్ల‌లు, గ‌ర్భిణులు దూరం ఉండ‌డం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version