ఇతరులతో తెలివిగా మాట్లాడాలంటే.. ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..!

-

ప్రతి ఒక్కరు ఒకే విధంగా మాట్లాడారు. కొంతమంది మాటలతో ఎంతో ఆకట్టుకుంటారు, మరికొందరు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. కాకపోతే ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వలన తెలివైన విధంగా కనిపించవచ్చు. ముఖ్యంగా కొత్త వారితో మాట్లాడినప్పుడు మన గురించి అంచనా వేయడం సహజమే. అయితే ఎంతో తెలివైన వారిలా కనిపించాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి, లేకపోతే అమాయకులుగా అంచనా వేస్తారు. కనుక తెలివైన విధంగా కనిపించాలంటే వీటిని తప్పకుండా ప్రయత్నించండి. అన్ని పరిస్థితులలో నిజాయితీగా ఉండడం సాధ్యం కాదు, ఎందుకంటే కొన్నిసార్లు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పకుండా తెలివిగా వ్యవహరించాలి మరియు ఇతరులతో ఎప్పుడూ మర్యాదగా వ్యవహరించాలి. అంతేకాకుండా మాట్లాడే పదాల పై ఏకాగ్రత ఉండాలి. ఎప్పుడైనా మాట్లాడే సమయంలో మంచి పదాలను ఉపయోగించి సరైన విధంగా కమ్యూనికేషన్ చేయాలి. ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి భాషను మాత్రమే ఎంపిక చేసుకుని మాట్లాడాలి. అంతేకాకుండా ఇతరులకు అర్థమయ్యే విధంగా వ్యవహరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు చెప్పాలనుకునే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి మరియు చెప్పే విషయాలను సూటిగా చెప్పాలి. ఇతరులకు స్పష్టంగా తెలియజేయడం వలన మీ పాయింట్ ఎంతో త్వరగా అర్థమవుతుంది.

మాట్లాడే మాటలతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో అవసరం. ఎప్పుడైతే సరైన విధంగా ప్రవర్తిస్తారో ఇతరులు ఆసక్తిగా వింటారు. అంతేకాకుండా మంచి బాడీ లాంగ్వేజ్ ఉండడం వలన మీకు కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది మరియు మాటల్లో ఎటువంటి చెడు అర్ధాలు రాకుండా ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు తెలివిగా కనిపించాలంటే ప్రత్యక్ష అనుభవాలను పంచుకోవాలి. ఇలా చేయడం వలన ఇతరులను ఆకట్టుకోవచ్చు. పైగా ఎటువంటి అమాయకత్వం కూడా కనిపించదు. ఎప్పుడైతే అమాయకత్వం కనిపిస్తుందో ఇతరులు మరింత చులకనగా చూస్తారు. దీంతో అనవసరంగా అలుసుగా తీసుకొని మిమ్మల్ని బాధ పెడతారు. కనుక వీలైనంతవరకు తెలివైన విధంగా వ్యవహరించాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news