డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అంటూ ఐజి అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రవీణ్ మృతి పై ఎలాంటి అనుమానాలను లేవని.. స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు తమకు చెప్పినట్లు అశోక్ కుమార్ వెల్లడించారు. అసలు ఏం జరిగిందో మీరే దర్యాప్తు చేసి చెప్పండి అని ప్రవీణ్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరినట్లు వివరించారు. ప్రవీణ్ పగడాల మృతి చెందిన రోజు మొత్తం ఆరుగురితో ఫోన్లో మాట్లాడారని తెలిపారు.

రెండు నెలల కాల్ డేటాను పరిశీలించగా ప్రవీణ్ ఎవరితోనూ అనుమానాస్పదంగా మాట్లాడినట్లు అనిపించలేదని వివరించారు. ప్రవీణ్ ది హత్య అని ఆరోపించిన వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఐ జి అశోక్ కుమార్ తెలిపారు. అదంతా బూటకమేనని క్లారిటీ ఇచ్చారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మొత్తం మూడు ప్రాంతాల్లో వైన్ షాప్ లకు వెళ్లినట్లు కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రవీణ్ పగడాలకు దారిలో మూడు సార్లు యాక్సిడెంట్ కూడా అయిందని ఐజి అశోక్ కుమార్ ప్రకటన చేశారు.