ఆహారాన్ని తీసుకునే ముందు గోరువెచ్చగా ఉండే నీళ్లను తీసుకోవాలి, ఇలా ప్రతిరోజు చేయడం వలన మెటబాలిజం పెరుగుతుంది. దీంతో పాటుగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోండి. దీనిలో ఒక స్పూన్ తేనె కలుపుకొని కూడా తాగవచ్చు. ఇలా చేయడం వలన మంచి రుచిని పొందవచ్చు పైగా బరువును కూడా తగ్గేందుకు ఇది ఎంతో సహాయం చేస్తుంది. నిమ్మరసం కలిపిన నీళ్లలో దాల్చిన చెక్క పొడి కూడా వేసుకుని తాగవచ్చు.
దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వలన కొవ్వును కరిగించడానికి సహాయం చేస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయాన్నే తాగడం వలన పొట్ట భాగంలో ఉండే కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది మరియు పూర్తి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా తాగిన తర్వాత వాకింగ్ లేక తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఫలితం ఇంకా త్వరగా ఉంటుంది. నిమ్మరసం ను కలుపుకోవడం వలన శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. దీంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందుతాయి. ఈ విధంగా ఇన్ఫ్లమేషన్ వంటి మొదలగు సమస్యలను దూరం చేయడానికి సహాయం చేస్తుంది.
ఆహారాన్ని తీసుకునే ముందు ఈ నిమ్మరసం కలిపిన నీరుని తాగడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడటానికి సహాయం చేస్తుంది. ఇటువంటి ఆరోగ్యకరమైన వాటిని రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన పంచదార కలిపినటువంటి జ్యూస్, సోడా, డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు. నిమ్మరసం ను తీసుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా సాయం చేస్తాయి మరియు కిడ్నీలో ఉండే చిన్న స్టోన్స్ ను కరిగించడానికి కూడా నిమ్మరసం సహాయపడుతుంది. ఎన్నో ఉపయోగాలను అందించే ఈ నీరు ని ప్రతిరోజు ఆహారం ముందు తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు.