పరీక్షలు సమయంలో విద్యార్థులు ఎంతో ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా ఆందోళన ఏర్పడడం వలన చదవడం ఎంతో కష్టం అవుతుంది. అయితే ఒత్తిడికి గురవడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అని నిపుణులు చెబుతున్నారు. అయితే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని మార్పులను చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. పరీక్షల సమయంలో పిల్లలు చదవడానికి శక్తి ఎంతో అవసరం. కనుక రోజువారి ఆహారంలో భాగంగా ప్రోటీన్ మరియు తృణధాన్యాలు ఉండే విధంగా చూసుకోవాలి.
ఇలా చేయడం వలన మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు మరియు ఒత్తిడిని తట్టుకునే శక్తి కూడా ఏర్పడుతుంది. విద్యార్థుల డైట్ లో భాగంగా విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్ వంటి మొదలైన పోషకాలు ఉండే విధంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా డైట్ లో మార్పులు చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనం తీసుకునేటువంటి ఆహారం కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. పరీక్షలు సమయంలో విద్యార్థులు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ను తీసుకోవడం వలన మానసిక ఆరోగ్యం ఎంతో పెరుగుతుంది. ముఖ్యంగా అవకాడో, బాదం, చేపలు వంటివి తీసుకోవడం వలన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.
వీటితో పాటుగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వలన హార్మోన్ల ఉత్పత్తి కూడా సరైన విధంగా ఉంటుంది. దీంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు మరియు ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోరు. సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోకపోవడం వలన ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కనుక ప్రతిరోజు ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంతో పాటు మంచినీరును కూడా కచ్చితంగా తీసుకోవాలి. వీటన్నిటితో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నిద్ర, వ్యాయామం కూడా ఎంతో అవసరం.ఇటువంటి చిన్న చిన్న మార్పులను జీవన విధానంలో చేయడం వలన ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలను పూర్తి చేయగలుగుతారు.