బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం..!

-

డబ్బులు అవసరం ఉండి బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే ఇప్పుడు అసలుకే మోసం జరిగిపోయింది. తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది. తాకట్టు పెట్టించిన అప్రైజర్ కనిపించకుండా పోయారు. దీంతో ఖాతాదారులు లబో దిబో మంటున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట లో జరిగింది.  తేటగుంటకు చెందిన ప్రజలు స్థానిక బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఇలా తీసుకున్న డబ్బులకు వడ్డీ కడుతూ వచ్చారు. జీవన పరిస్థితులు మెరుగుపడటంతో పూర్తి డబ్బులు కట్టేందుకు బ్యాంకుకు వెళ్లారు. డబ్బు కట్టే సమయంలో బిగ్ షాక్కు గురయ్యారు.

తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకులో కనిపించలేదు. ఏం జరిగిందని ఆరా తీస్తే బంగారం తాకట్టు పెట్టించిన అప్రైజర్ కొట్టేశారని తెలిసింది. దాదాపు 160 మంది ఖాతాదారులకు చెందిన బంగారు నగలను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఖాతాదారులు అందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ స్పందించారు. బ్యాంకులో బంగారం మాయం అయిన విషయాన్ని నిర్ధారించారు. బ్యాంకు అప్రైజర్ బంగారం కొట్టేశారని తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ పై అధికారులతో మాట్లాడి ఎంత బంగారం తాకట్టు పెడితే అంతేమొత్తంలో డబ్బుగాని, గోల్డ్ కానీ ఇస్తామని తెలిపారు. అప్పటి వరకూ
సంయమనం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version