వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలు పాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. వీటి పై విచారన చేసి వీరిని జైలుకు పంపుతాం అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
తప్పు చేసిన ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని తప్పించుకుతిరుగుతున్నారని పేర్కొన్నారు. పేర్ని నాని సహా అతని కుటుంబం పై విచారణకు సిట్ సిఫారస్ చేస్తానని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ మాజీ మంత్రులు ఇద్దరూ కూడా నెక్ట్స్ టార్గెట్ అని పేర్కొనడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. ఇటీవలే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విషయం విధితమే.