మహిళల శరీరంలో హార్మోన్స్ మార్పులు నొప్పులు అలసట ఇతర అసౌకర్యాలు సహజంగా ఈ పీరియడ్స్ టైం లో కనిపిస్తాయి. ఈ సమయంలో శరీరానికి కొంత రెస్ట్ అవసరం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో రెస్ట్ తీసుకోవడం కుదరని వారు ఆఫీసులో, ఇంట్లో రెస్ట్ లేకుండా గడుపుతున్నారు. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం శారీరక మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. మరి పీరియడ్స్ టైం లో కొన్ని ఆహారాలు తీసుకోవడం ఆ టైంలో వచ్చే కొన్ని నొప్పులను తీవ్రతరం చేస్తాయి వీటిని ముందుగానే గుర్తించి నివారించాలి. మరి పీరియడ్స్ టైం లో ఆరోగ్యానికి హానికరమైన ఆహారాలు ఏంటి అనేవి చూద్దాం..
పీరియడ్స్ టైం లో ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. చిప్స్, నూడిల్స్ ఊరగాయలు ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అధిక ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకోవడానికి కారణమై పొట్టలో ఉబ్బరంగా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ టైంలో తక్కువ ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవాలి అంతేకాక తాజా కూరగాయలు పండ్లు తీసుకోండి.
పీరియడ్స్ టైం లో షుగర్ అధికంగా ఉన్న ఆహారాలను దూరం పెట్టాలి. స్వీట్స్, కేకులు, సోడా కూల్ డ్రింక్స్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. ఇవి అధిక చక్కెర కలిగి గ్లూకోస్ స్థాయిని హెచ్చుతగ్గులు చేస్తాయి. తద్వారా అలసట, ఆందోళన కలుగుతుంది. వీటికి బదులుగా తేనె, ఖర్జూరం వంటి సహజ స్వీట్ పదార్థాలను ఉపయోగించాలి.
ఎక్కువమంది మహిళలు ఏ టైం అయినా వారి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాఫీ, టీ లను ఎక్కువగా తాగుతారు. కానీ పీరియడ్స్ టైం లో కాఫీ, టీ ఎనర్జిటిక్ డ్రింక్స్ వంటివి తీసుకోకూడదు. కాఫీలో ఉండే కెఫేన్ ఆందోళన, నిద్రలేమి కారణమవుతుంది. ఈ టైం లో హార్మోన్స్ ఇన్ బాలన్స్ వల్ల మహిళలలో రొమ్ము నొప్పిని పెంచుతుంది. దీనికి బదులుగా హెర్బల్ టీ,లు తాజా పళ్ళ రసాలు లేదా వాటర్ తీసుకోవడం మంచిది.

ఇక అంతేకాక ఈ టైంలో అధిక కొవ్వు ఉన్న పదార్థాలను దూరం పెట్టాలి. బర్గర్, పిజ్జ, జంక్ ఫుడ్ లను తీసుకోకూడదు. వీటి వలన శరీరంలో ఇన్ఫ్లుమేషన్ పెంచి నొప్పులు కలగడానికి కారణం అవుతాయి. అందుకే ఈ మూడు రోజులు మన ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు చేపలు, అవిస గింజలు, అవకాడో వంటివి తీసుకోవాలి.
ఇక అంతేకాక పీరియడ్స్ సమయంలో శరీరం నుండి చెడు రక్తం బయటకు వెళ్తుంది. అందుకే ఈ టైంలో ఐరన్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఆకుకూరలు, బీన్స్, గింజలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నొప్పులను తగ్గడానికి బాదం, అవిస గింజలు, ఓట్స్ లాంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. నీరసం రాకుండా విటమిన్ సి ఉన్న పండ్లను తీసుకోవాలి.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన మాత్రమే ఏదైనా అనారోగ్యం అనిపిస్తే దగ్గరలోని గైనకాలజిస్ట్ ను సంప్రదించండి.)