సీమ చింతకాయలు..అలియాస్ గుబ్బకాయలు. గ్రామాల్లో ఈ పేరు వినని వారంటూ ఉండరూ.. మనీలా టామరిండ్, మద్రాస్ టోర్న్, డెవిల్స్ నెక్లస్, జంగిల్ జలేబి అనే పేర్లతో కూడా వీటిని పిలుస్తారు. సిటీల్లో ఉండే చాలామందికి ఈ కాయల గురించి పెద్దగా తెలియదు. పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఇవి వగరుగా అనిపిస్తాయి. పండిన తర్వాత తింటే ఉంటుంది..
సూపర్ టేస్ట్. ఊర్లలో ఉండే పిల్లలు అయితే..ఈ చెట్లు కనిపిస్తే చాలు..రాళ్లతో కొట్టి కాయలు తీసుకుని పోగులుగా చేసుకుని..షేర్ చేసుకుంటారు.. చిన్నప్పుడు ఇలాంటివి అన్నీ భలే క్రేజీగా అనిపిస్తాయి కదూ. వాటిలో లాభాలు ఏంటో తెలియని రోజుల్లో మనం తిని ఉంటాం..కానీ ఇప్పుడు ఈ సీమచింతకాయల వల్ల ఉన్న ప్రయోజనాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి..ఊర్లల్లో ఫ్రీగా దొరికేవి..సీటిల్లో కప్పుల్లెక్క అమ్ముడుపోతున్నాయి. ఈరోజు మనం వీటివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
- గర్భిణీ స్త్రీలకు సీమ చింత మంచి పోషకాలను ఇస్తుంది. నీరసం తగ్గిస్తుందట.
- ఈ కాయలలో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి.
- సీమచింతకాయల ఆకులలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో నిరూపించారు.
- ఆ ఆకుల్లోని గుణాలు రొమ్ము క్యాన్సర్ నివారించడంలో, క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా అడ్డుకోవడానికి తోడ్పడతాయట.
- ఈ కాయలు కాలేయం పనితీరును మెరుగుపరచడంతో పాటూ, హానికరమైన టాక్సిన్లను నిర్మూలిస్తాయి.
- సీమ చింతకాయల లో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. పీచులు ఎక్కువగా ఉన్న ఆహారం తినటం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. ప్రేగులు క్లీన్ అవుతాయి.
- సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి ఉండటం వల్ల ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది.
- ఇంకా ఈ కాయల్లో ఫైటో కెమికల్స్ ఉండడం వల్ల మధుమేహు వ్యాధి గ్రస్థులకు ఉపయోగం ఉంటుంది. డయాబెటిక్ లక్షణాలను తగ్గేలా చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.
- యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి సీమ చింతకాయలు. ఈ గుణాలు ప్రేగులోని సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది.
-Triveni Buskarowthu