వాము వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా…?

-

మన కిచెన్ లో వాము ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. దీని వల్ల మంచి రుచి సువాసన వస్తుంది. దీన్ని వాడటం మనకి కొత్తేమీ కాదు. మన పూర్వీకుల నుంచి దీనిని ఉపయోగిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జంతికలు, మురుకులు వంటి వాటిలో ఇది లేకపోతే వాటి రుచి తగ్గిపోతుంది. వాము వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మరి వాటి కోసం తెలుసుకోవడానికి ఒక లుక్ వేసేయండి. వాము జీర్ణ శక్తికి చాలా మంచిది అని మనకి తెలుసు. రుచి కొంచెం ఘాటుగా కారంగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి మాత్రం మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

జలుబు, మైగ్రెయిన్, తల నొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డ లో కట్టి వాసన చూశారంటే ఈ సమస్య తగ్గిపోతుంది. వాంతులు తగ్గాలి అంటే వాముని నీళ్ల లో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే తగ్గుతాయి. అలానే జ్వరం ఉన్నప్పుడు వాము, ధనియాలు, జీలకర్ర కలిపి కషాయం చేసుకుని తాగితే జ్వరం చిటికె లో మాయం అయిపోతుంది. గొంతులో ఇబ్బందిగా ఉంటే వామును బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని నెమ్మదిగా మింగుతూ ఉంటే గొంతు నొప్పి తగ్గుతుంది.

ఆస్తమాతో ఇబ్బంది పడే వాళ్లు కొద్దిగా వాము కొంచెం బెల్లం కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. గుండె వ్యాధులు రాకుండా నివారించడం లో వాము సహాయ పడుతుంది. ఎసిడిటీ తగ్గాలంటే వాము, జీలకర్రని నీటిలో మరిగించి తాగితే తగ్గిపోతుంది. గర్భవతులు రెగ్యులర్ గా తింటే రక్తాన్ని శుభ్రపరుస్తుంది మరియు శరీరం లోని రక్త ప్రసరణ సరిగ్గా సాగేలా చూస్తుంది. చూశారు కదా వాము వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో..! మరి ప్రతి రోజూ మీ వంటల్లో దీనిని తప్పక ఉపయోగించండి ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version