హైదరాబాద్‌లో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ నోట్లు ముద్రిస్తున్న స్థావరాన్ని రాచకొండ పోలీసులు గుర్తించారు.శుక్రవారం ఉదయం ఎల్బీ నగర్, మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు ఎల్బీనగర్ ప్రాంతంలోని ఓ ఇంటి పై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు గుర్తించారు.అతని వద్ద అప్పటికే ముద్రించిన రూ.5 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్లను చిన్న,చిన్న వ్యాపారుల వద్ద రాత్రి సమయంలో చలామణి చేస్తున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సీపీ సుధీర్ బాబు ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారని తెలుస్తోంది.