డైలీ పుదీనా నీళ్లు తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా..?

-

మసాల వంటలో రెండు పుదీనా ఆకులు వేస్తేనే గుమగుమలాడిపోతుంది. మంచి వాసన ఇచ్చే గుణం పుదీనాకు ఉంది. దీంతో రుచిమాత్రమే కాదు.. ఇంకా ఇతర ఆరోగ్యప్రయజనాలు చాలా ఉన్నాయి. చాలామంది పుదీనా టీ తాగుతుంటారు. మాములు టీలకంటే ఇదీ వందరెట్లు బెటర్‌..! కానీ అందరికీ నచ్చదు. ఈ ఆకుల్లో ఉండే యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఆరోగ్యాన్ని ఎన్నో రోగాల నుంచి కాపడతాయి. అయితే పుదీనా నీళ్లు తాగడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దామా.!

పుదీనా ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్, ఫైటోన్యూట్రియెంట్స్ గుణాలు జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

మలబద్దకం ఉన్నవారు డైలీ పుదీనా నీళ్లు తాగితే..సుఖ విరోచనం అవుతుంది.అజీర్ణ సమస్యలు తొలగిపోయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దంతాలు, చిగుళ్ళ సమస్యతో బాధపడేవారికి మంచి వైద్యంలా ఉపయోగపడుతుంది. పుదీనా నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.

నోటి బాక్టీరియాను తొలగించడంలో ఈ నీరు ఎంతో ప్రయోజనకారి. ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.

అలర్జీ, ఆస్తమాతో బాధపడేవారికి పుదీనా నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. అసలే ఇది వర్షాకాలం.. డైలీ ఒక్కసారైనా ఈ వాటర్‌ తాగుతుంటే.. జలుబు, దగ్గు భారిన పడకుండా ఉండొచ్చు.

పుదీనా నీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను కూడా పటిష్ట పరుస్తుంది. మెగ్రైన్‌ నొప్పితే బాధపడేవారి డైలీ పుదీనా టీ తాగడం వల్ల లాభం ఉంటుంది. పుదీనా ఆకుల్లోని మెంథాల్ కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి కూడా పుదీనా నీళ్లు బాగా హెల్ప్‌ అవుతాయి. బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను పుదీనా నీళ్లు కరిగిస్తాయి. కాబట్టి డైలీ పుదీనా నీళ్లు తాగడం అలవాటుగా పెట్టుకుంటే సీజనల్‌ వ్యాధులతో పాటు ఇతర జబ్బులు కూడా దరిచేరవంటున్నారు నిపుణులు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version