బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి చీటి సకులమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.ఆమె మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలువురు రాజకీయ నేతలు సైతం సంతాపం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ తన సోదరిని కడసారి చూసుకునేందుకు ఫౌంహౌస్ వీడి ఆమె ఇంటికి చేరుకున్నారు.
అనంతరం తన సోదరి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత సైతం సకులమ్మ మృతికి సంతాపం తెలిపారు.వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను ఓదార్చారు. తాజాగా కేసీఆర్ సోదరి మరణవార్త గురించి తెలుసుకుని ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసీఆర్‌కి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పీఎంవో ఆఫీస్ ఒక నోట్ రిలీజ్ చేసింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి చీటి సకులమ్మ మరణం పట్ల సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
కేసీఆర్‌కి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధాని మోడీ https://t.co/XGuMNxQje9 pic.twitter.com/lvYw4UoJ5n
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2025