దానిమ్మలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

-

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇక వివరాల్లోకి వస్తే…. అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ లో కలిగి ఉన్నాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. అలానే దానిమ్మ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధ పడేవారు అత్యంత రుచికరమైన దానిమ్మ రసం తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను నుంచి కూడా దానిమ్మ రసం తగ్గిస్తుంది.

నీళ్ల విరేచనాల తో బాధపడే వారికి ఇది మంచి ఔషధం. రుతుస్రావ సమయం లో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకి దానిమ్మ రసం విరుగుడు. గుండె ఆరోగ్యానికి కూడా ఇది బాగా మేలు చేస్తుంది. రక్త పోటును తగ్గించే గుణం దానిమ్మ లో కలిగి ఉంది. దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి కూడా పని చేస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం వల్ల అలర్జీలు, కీటకాలు కుట్టడం వలన వచ్చే పొక్కులు వంటివి కూడా మాయమైపోతాయి.

గొంతు రోగాలకి కూడా ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది. ఒంటి మీద ఏమైనా వాపులు వంటివి వస్తే దీని ఆకుల నూనె రాసుకుని ఉంచితే వాపు తగ్గి పోతుంది. గర్భస్థ శిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన పోలిక్ యాసిడ్ ఈ పండు లో పుష్కలంగా ఉంది. గర్భిణీలు రోజుకి ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా దీని వల్ల తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version