జీవితం చిన్నదా పెద్దదా అన్నది పక్కన పెడితే మనం జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం అనేది ముఖ్యం అవుతుంది. కొందరు రోజూ పొద్దున్న లేవగానే బాధలని అంటిపెట్టుకుంటారు. మరికొందరు బాధల్ని పక్కన పెట్టేసి, హాయిగా నిద్రలేస్తారు. నువ్వెలా ఉండాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. ఐతే అన్నీ తెలిసినా కూడా కొన్ని విషయాల్లొ తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మనలో చాలామంది ఆనందం కంటే భద్రతకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. జీవితాన్ని హాయిగా జీవించడానికి ఆనందం కావాలి. భద్రత ముఖ్యమే కానీ ఆనందం దానికన్నా ముఖ్యమైనది. రేపేం జరుగుతుందో అన్న టెన్షన్ నీకు ఉన్నన్ని రోజులు నువ్వు హ్యాపీగా ఉండలేవు.
తమపై తమకి నమ్మకం ఉండక తమలో ఉన్న సామర్థ్యాన్ని వృధా చేసుకుంటారు. ఎవరో డిసైడ్ చేసిన దాన్ని నువ్వెలా నమ్ముతావు. నీ సామర్థ్యం గురించి నీకే తెలియకపోవచ్చు. వేరే వారికెలా తెలుస్తుంది.
కొంతమంది కష్టపడి విజయం చేజిక్కించుకున్నప్పటికీ దయనీయమైన స్థితిలో ఉంటారు. అంటే విజయం అన్ని సమకూరుస్తుందనుకుంటే పొరపాటే.
నీ చావు ఎప్పుడు రాసి పెట్టి ఉందనేది ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు నువ్వు శ్వాస తీసుకుంటున్నావు. రేపు కూడా ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. రేపటి దాకా ఎందుకు మరుక్షణం కూడా ప్రాణాలు పోవచ్చు. అందుకే చావు గురుంచి ఆలోచించడం సమయం వృధా చేసుకున్నట్టే.
ఎంతోమంది కలలు నిజమవ్వక ముందే కలలాగే మిగిలిపోతున్నాయి.
విజయానికి అంగుళం దూరంలో ఉన్నారని తెలుసుకోకుండానే కష్టపడడం మానేస్తున్నారు. చాలా మందికి ఎదురవుతున్న సమస్య ఇదే. అంటే నువ్వు ఫెయిలయ్యావంటే విజయానికి చాలా దగ్గరలో ఉన్నావని అర్థం.