మంచి ఆరోగ్యానికి పోషక విలువలు ఉండేటువంటి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. చాలా మంది సరైన నిద్ర లేకపోవడం వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా నిద్రలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్ర అనేది ఎంతో అవసరం. రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోతే ఉదయానికి శక్తి లభించదు. దీంతో రోజంతా ఎంతో నీరసంగా ఉండాల్సి వస్తుంది. ఇదే అలవాటుగా మారిపోవడం వలన క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎప్పుడైతే మంచి నిద్రను పొందుతారో అప్పుడు మెదడు పనితీరు బాగుంటుంది. ముఖ్యంగా ఆలస్యంగా నిద్రపోవడం వలన మెదడుకి సరైన విశ్రాంతి దొరకదు. దీంతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎక్కువ అవడం వలన చాలా శాతం మంది రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు. అయితే ఇలా చేయడం వలన ఆరోగ్యానికి ఎంతో ముప్పు ఉంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే ప్రతిరోజు రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోతారో హార్మోన్ల సమతుల్యత కూడా ఏర్పడుతుంది. దాని వలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
మంచి నిద్రను పొందాలంటే మీ చుట్టూ ఉండే ప్రదేశాలను ప్రశాంతంగా మార్చుకొని ఎటువంటి ఒత్తిడి లేకుండా నిద్రపోవాలి. యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మంచి నిద్రను పొందవచ్చు. సరైన నిద్ర లేకపోవడం వలన జీర్ణవ్యవస్థ పై కూడా ప్రభావం ఎంతో ఉంటుంది. ఎప్పుడైతే ఆలస్యంగా నిద్రపోతారో జీర్ణక్రియ సరైన విధంగా జరగదు. దాంతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక ఆలస్యంగా నిద్రపోవడం అలవాటుగా మారకముందే తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే ఆలస్యంగా నిద్రపోతే పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక కచ్చితంగా 11 గంటల లోపు నిద్రపోవాలి.