ప్రస్తుత తరుణంలో చాలా మంది స్టీల్‌కు బదులుగా ప్లాస్టిక్‌తో తయారుచేయబడిన లంచ్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. కానీ నిజానికి ప్లాస్టిక్ లంచ్ బాక్సులు అంత క్షేమకరం కాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్లాస్టిక్ లంచ్ బాక్సులలో ఆహారాన్ని ఉంచితే అందులోకి ప్లాస్టిక్ లో ఉండే జీనోఈస్ట్రోజెన్స్ అనబడే హానికారక రసాయనాలు విడుదలవుతాయట. అవి మనకు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయని వైద్యులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ లో ఉండే హానికారక రసాయనాలు ఆహారంలోకి విడుదలయ్యాక ఆ ఆహారాన్ని మనం తింటాం. దీని వల్ల ఆ కెమికల్స్ మన శరీరంలోకి వెళ్లి హార్మోన్ అసమతుల్యతలను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల శరీరంలోకి ఈ కెమికల్స్ చేరితే వారిలో ఎదుగుదల సమస్యలు వస్తాయట. దీంతోపాటు స్థూలకాయం, పీసీవోడీ, ఫ్యాటీ లివర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ప్లాస్టిక్ లంచ్ బాక్సులే కాదు, ఇతర ఏ ప్లాస్టిక్ తో తయారు చేయబడిన పాత్రలోనూ ఆహారం నిల్వ చేయరాదని, ఆ ఆహారాన్ని తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా సంప్రదాయ స్టీల్‌తో తయారైన బాక్సులు, పాత్రలను వాడాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు లంచ్ బాక్సులను స్టీల్‌తో తయారు చేయబడిన వాటినే ఉపయోగించాలని, అలాగే వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్‌తో తయారుచేసినవి కాకుండా, స్టీల్‌తో తయారు చేసినవి వాడాలని లేదంటే కాపర్ (రాగి) అయినా ఫర్వాలేదని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఇకపై మీరు కూడా ప్లాస్టిక్ బాక్సులు, పాత్రలను అస్సలు ఆహారం కోసం వాడకండి. లేదంటే అనవసరంగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు..!