కోవిడ్ కాలంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య చిట్కాలు…!

-

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ ధాటికి వణికిపోతుంది. ఈ నేపధ్యంలో సమస్త భూగోళానికి తాళం పడింది. దీని వల్ల అన్ని రంగాలు తీవ్ర నష్టాల్లోకి పడిపోయాయి. దీని వల్ల ఆర్ధిక వ్యవస్థ పతనమైంది. ఈ కరోనా బారి నుండి ప్రజలను కాపాడటానికి ఆయా ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో అయితే పిల్లలు, వృద్దులను అసలు బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్దులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు రుజుతా దివాకర్ సూచించారు.

కోవిడ్ కాలంలో వయో వృద్దులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఒక సదస్సులో ఆమె తెలిపారు. గింజలు, మొక్కజొన్నలు, తృణధాన్యాలు, రాగులు వంటి ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రాగుల్లో ఎక్కువ పోషకాలు ఉన్నందున అవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయ పడతాయి. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు చక్కటి పరిష్కారం. అంతేకాక అన్ని ప్రాంతాలలోను లభించే అరటి, మామిడి పళ్ళను తీసుకోవడం కూడా చాలా మేలు కలిగిస్తుంది. ప్యాకెట్ల ఆహారం కన్నా తాజా పళ్ళను తీసుకోవడం వల్ల అవి మంచి యాంటి ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి.

రాత్రి పూట ఆహారంలో మసాలాలు తగ్గించి వాడాలి. కిచిడిలో నెయ్యి కలిపి తింటే చక్కని నిద్ర పడుతుంది. కేవలం బియ్యం తో వండిన ఆహారం మాత్రమే కాక పప్పులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషక పదార్థాలు అన్ని అందుతాయి. అంతేకాక వృద్దులకు తెలిసిన పోషక విలువలున్న ఆహారాలను తెలియచేయడం వల్ల ఈ తరం వారికి మంచి సమాచారం అందించిన వారౌతారు. పిల్లలకు కూడా చాక్లెట్స్ వంటి ప్యాకింగ్ ఫుడ్ ని దూరంగా ఉంచాలి అని ఆమె తెలియచేసారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version