డబుల్‌ చిన్‌ సమస్యా..? అధిక బరువు మాత్రమే కాదు ఇది కూడా కారణం కావొచ్చు

-

ఒక వ్యక్తి లావు అవుతున్నాడంటే వాళ్లలో మొదట వచ్చే మార్పు గడ్డం కింద గడ్డం రావడం, ఆ తర్వాత చిన్నగా బొజ్జ వస్తుంది. ఇక ఒక్కొ భాగంగా మెల్లగా కొవ్వు పేరుకుపోవడం స్టాట్‌ అవుతుంది. గడ్డం కింద గడ్డం రావడం వల్ల చూసేందుకు కూడా ఫేస్‌ లుక్‌ మారిపోతుంది. ఏజ్డెగా అనిపిస్తారు. ఈరోజు మనం అసలు ఇలా ఎందుకు వస్తుంది, దీన్ని తగ్గించుకునే మార్గాలు చూద్దాం..!

ఎందుకిలా?

డబుల్‌ చిన్‌ రావడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.

అధిక బరువు – ఒకేసారి బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. బరువు పెరిగినప్పుడు గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం, తగ్గినప్పుడు అక్కడి చర్మం వదులుగా మారడమే ఇందుకు కారణం.

వంశపారంపర్యంగా – డబుల్‌ చిన్‌ రావడానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు.

వయసు పైబడడం – వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ కండరాలు దృఢత్వాన్ని కోల్పోతాయి. తద్వారా గడ్డం కింద కొవ్వు పేరుకుపోవడం, అక్కడి చర్మం వదులవడం వల్ల కూడా డబుల్‌ చిన్‌ వస్తుందట!

ఇలా చేయండి..

బాగా నమలండి..!

డబుల్‌ చిన్ సమస్యతో బాధపడే వారు ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం అవుతుంది. పటిష్టంగా తయారవుతాయి. దీనివల్ల అదనపు కొవ్వులు పేరుకుపోకుండా చక్కటి ముఖ వర్ఛస్సును సొంతం చేసుకోవచ్చు. అలాగే మార్కెట్లో లభించే షుగర్‌ ఫ్రీ చూయింగ్ గమ్స్ నమలడం కూడా మంచిదే. తద్వారా దవడల దగ్గర పేరుకున్న కొవ్వు సులభంగా కరుగుతుంది.

తెల్లసొనతో

రెండు గుడ్లలోని తెల్లసొన, ఒక టేబుల్‌స్పూన్ పాలు, కొద్దిగా తేనె-నిమ్మరసం.. ఇవన్నీ బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని డబుల్ చిన్ ఉన్న చోట ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. అలా 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల డబుల్‌ చిన్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గుడ్డు వాసన నచ్చని వారు ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి కాఫీ, టీలకు బదులుగా గ్రీన్‌ టీని డైట్‌లో చేర్చుకుంటే డబుల్‌ చిన్‌ ఏంటి ఒంట్లో ఎక్కడ కొవ్వు ఉన్నా ఈజీగా తగ్గించుకోవచ్చు.

విటమిన్ ‘ఇ’

మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రౌన్ రైస్, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, స్వీట్ కార్న్, యాపిల్, సోయా బీన్స్, పప్పు దినుసులు.. ఇలాంటి వాటిల్లో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా లభిస్తుంది.. కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.

నీళ్లు ఎక్కువగా..

రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వుతో పాటు దవడ, గడ్డం కింద పేరుకున్న అనవసర కొవ్వులు కూడా కరిగిపోతాయి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను కూడా ఆహారంలో చేర్చకోవాలి.

ఈ వ్యాయామాలతో

ఎక్కువగా నవ్వడం, మాట్లాడటం వల్ల కూడా ముఖ కండరాలకు చక్కని వ్యాయామం అందుతుంది. తద్వారా డబుల్‌ చిన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

మెడ గుండ్రంగా, నెమ్మదిగా కొద్ది సమయం పాటు తిప్పడం, పైకి-కిందకు కదిలించడం మొదలైన చిన్న చిన్న వ్యాయామాల ద్వారా కూడా ఫలితం ఉంటుంది.

అలాగే క్యాలరీలు, కొవ్వులు లేని ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news