ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ అనేది ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా పిల్లలలో కాన్ఫిడెన్స్ ఎంతో అవసరం. అయితే పిల్లల్లో కాన్ఫిడెన్స్ రావాలంటే వాళ్లకు ఇవి చెప్పడం ఎంతో అవసరం. పిల్లలు ఎదుగుదలకు కాన్ఫిడెన్స్ ను ఇవ్వాలి. ముఖ్యంగా ఏ విషయాన్ని అయినా పాజిటివ్ గా చెప్పాలి. ఇలా చేయడం వలన వారిలో ఉండే భయం తగ్గుతుంది. పిల్లలు చేసే ప్రతి పనిని గుర్తించి మోటివేట్ అయ్యే విధంగా మాట్లాడాలి. దాంతో ఎదుగుదల సరైన విధంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా కొత్త పనిని ప్రారంభించేముందు చాలా ధైర్యం అవసరం.
అయితే పిల్లలలో కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ముఖ్యంగా వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకురావాలి. ఇలా చేయడం వలన వారు మంచి నిర్ణయాలను ఎంతో ధైర్యంగా తీసుకుంటారు. దీంతో ఎంతో స్ట్రాంగ్ గా మారతారు. కాన్ఫిడెన్స్ ఒకసారి పెరిగింది అంటే వారు ఏదైనా చేయగలం అని నమ్ముతారు. కాబట్టి ఎప్పుడూ ఇదే విధంగా మోటివేట్ చేయాలి. పిల్లలు చెప్పిన విధంగా నడుస్తూ ఎదుగుతున్న సమయంలో మీరు చేయగలరు అని నమ్మకాన్ని తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే నేర్చుకునే ప్రక్రియలో వారు తిరిగి కాన్ఫిడెన్స్ ను కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని దాటుకొని వెళ్ళాలి అని చెప్పాలి. ఇలా చేయడం వలన వారి పై ఉండే నమ్మకం ఎక్కువ అవుతుంది. ఎదుటివారు మనతో ఎలా మాట్లాడారు అనే ఆలోచన తీసేయాలి. ఎందుకంటే మీపై నమ్మకం మీకు ఉండాలి. ఇతరులు అభిప్రాయాల వలన మీ కాన్ఫిడెన్స్ అసలు దెబ్బ తినకూడదు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎంతో కష్టపడాలి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే దృఢ సంకల్పంతో దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా విజయాన్ని సాధిస్తే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.