తిరుపతిలో జరిగిన ఘటనపై స్పందించాటారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. అయితే తిరుపతిలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. టిటిడి కి సంబంధించిన విషయంలో రాజకీయం చేయదలుచుకోలేదు.. కానీ ఇలాంటివి జరగకూడదు. జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. గతంలో లాగా ఏ ఊరి వారికి ఆ ఊరిలో టోకన్లు ఇచ్చి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు.
ప్రజలందరినీ ఒకే చోట చిన్న సందులో పెట్టి టోకన్ లను జారీ చేసే ప్రయత్నం చేయడంతోనే ఇంత ఘోరమైన ఘటన జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. అందరికీ నష్టపరిహారం అందించి న్యాయం చేయాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అన్నారు. అలాగే ఘటనా స్థలాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శిస్తారు. బాధితులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు అని ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి తెలిపారు.