స్నానం చేయడం అంటే..మన శరీరాన్ని నీట్ గా క్లీన్ చేసుకోవడం..దాని ద్వారా మనకు మంచి ఫ్రష్ ఫీల్ వస్తుంది. రోజుకు రెండుసార్లు స్నానం చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది..కానీ కొందరికి స్నానం చేయటం అంటేనే ఎక్కడలేని బద్ధకం..అదేదో యుద్దానికి వెళ్లమన్నట్లు అసలు కదలరే..ఇక అలాంటి వాళ్లను బలవంతంగా పంపినా..నీళ్లు వేస్ట్ అంతే. అయితే చాలామంది స్నానం చేసేప్పుడు హడావిడీగా..ఫేస్ ఒకటీ క్లీన్ చేసుకుని బాడీ అంతా ఒక రౌండ్ వేస్తారు సోప్ తో అంతే..స్నానం అయిపోయింది.
కానీ స్నానం చేసేప్పుడు ముఖం మీద పెట్టిన శ్రద్ధ బాడీలో ప్రతీ పార్ట్ మీద పెట్టాలి కదా..మోకాళ్లను బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే మోచేతులు, అరికాళ్లు, ఇంకా నాభీ. అసలు నాభీ ఒకటి ఉంది..దాన్ని క్లీన్ చేసుకోవాలని థాట్ కూడా చాలామందికి రాదు. నాభి (బొడ్డు)ను సరిగ్గా క్లీన్ చేసుకోకుంటే ఏం జరుగుతుందో..ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఈరోజు చూద్దాం.
నాభిని శుభ్రపరచుకోకుంటే ఏం జరుగుతుందో డాక్టర్ కరణ్ రాజ్ అనే వైద్యులు వివరించారు. మనం బొడ్డును శుభ్రం చేయకపోతే.. అక్కడ పేరుకుపోయిన మురికి క్రమంగా రాయిగా మారుతుందని ఆయన చెప్పారు. ఆ రాయికి ‘గ్రిమ్ జ్వెల్స్(Grim jewels)’ అని పిలుస్తారు. ‘అబోమినబుల్ జ్యువెల్ (Abominable jewel)’గా కూడా పేర్కొంటారు.
మన శరీరంపై చెమట, మృత చర్మకణాలు, నూనె, బట్టల ఫాబ్రిక్, సూక్ష్మక్రిములు మొదలైనవి పేరుకుపోతాయి. స్నానం చేసేటప్పుడు సబ్బుతో బాగా రుద్దుకొని శుభ్రం చేసుకుంటాం. ఐతే కానీ బొడ్డు ప్రాంతంలో రోజూ శుభ్రంచేసుకోకపోవడం వల్ల ఎక్కువ కాలంగా మురికి పేరుకుపోతుంది. దానిని తొలగించకుండా అలాగే ఉంచితే రాయిగా మారుతుందదట.
ఇది చాలా రంగులలో ఉంటుందని ఆయన చెప్పారు. వీటిలో అత్యంత సాధారణమైనది నలుపు రంగు రాయి. కొన్ని సందర్భాల్లో ఇది గోధుమ రంగులో కూడా కనిపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో Omphaloiths అంటారు. ఈ రాయిలో సెబమ్, కెరాటిన్ రెండూ ఉంటాయి.
నాభిని ఎలా శుభ్రం చేయాలి?
నాభి లోపల మృత కణాలు, ఇతర మురికి పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజూ స్నానం చేసే సమయంలో శుభ్రం చేసుకోవాలి. తేలికపాటి సబ్బు, గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. నాభి లోపల, వెలుపల తడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఆపై శుభ్రమైన నీటితో కడిగి, తేమలేని రుమాలుతో తుడుచుకోవాలి.
అయితే ఎక్కువ రోజుల పాటు క్లీన్ చేయకపోవడం వల్ల అది గట్టిగా ఉంటంది. మీరు అదే పనిగా క్లీన్ చేద్దాం అంటే..అది రాక విపరీతమైన నొప్పి వస్తుంది..కాబట్టి స్నానానికి ఒక గంట లేదా అరగంట ముందు..నాభిలో నూనె వేస్తే..ఆ తర్వాతా స్నానం చేయడానికి వెళ్లినప్పుడు మీరు ఊహించనంత మట్టి నాభీలోంచి వస్తుంది. అప్పుడు బాగా క్లీన్ చేసుకుని..తేమలేని క్లాత్ తో తుడుచుకోండి. ఇలా వారానికి ఒక సారి చేసినా నాభిలో మట్టి పేరుకు పోకుండా ఉంటుంది.
-Triveni Buskarowthu