ఇలా చేస్తే గాలి కాలుష్యం వలన ఇబ్బందులు వుండవు..!

-

ఈ మధ్య కాలంలో గాలి కాలుష్యం విపరీతంగా ఎక్కువయింది. గాలి కాలుష్యం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రెస్పిరేటరీ సమస్యలు వరకు చాలా అనారోగ్య సమస్యలకు ఇది దారి తీస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువవుతాయి. అందుకని చలికాలంలో దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

 

ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గాలి యొక్క నాణ్యత సరిగా లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మంచిదని అంటున్నారు. అదేవిధంగా వీలైనంతవరకూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం ముఖ్యం. వీటితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ డ్రింక్స్ ను తీసుకుంటే గాలి కాలుష్యం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పొటాషియం తక్కువగా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.

ముఖ్యంగా చలి కాలంలో గాలి కాలుష్యం ఉంటే శ్వాస మరింత కష్టమవుతుంది. అందుకోసం పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అరటిపండు, కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్లం లో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు కొబ్బరి నీళ్లు, అల్లం మరియు అరటిపండుతో స్మూతీని చేసుకుని తాగండి.

అలానే ఉసిరి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒంట్లో ఉండే మలినాలను కూడా తొలగిస్తుంది అందుకని ఆపిల్ జ్యూస్ మరియు ఉసిరి జ్యూస్ ని ఉదయాన్నే తాగితే మంచిది. పైనాపిల్ కూడా ఒంట్లో ఉండే మలినాలు తొలగిస్తుంది. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా శుభ్రంగా ఉంచుతుంది. పుదీనా కూడా రెస్పిరేటరీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకనే పైనాపిల్ జ్యూస్ మరియు పుదీనా రసాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అనుసరిస్తే గాలి కాలుష్యం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version