వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష ఖరారు

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. గతంలో ఓ చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో రామ్‌గోపాల్ వర్మను దోషిగా నిర్దారిస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష విధించింది.

అయితే, గత ఏడు సంవత్సరాలుగా చెక్ బౌన్స్ కేసులో విచారణ జరుగుతుండగా.. ఆర్జీవీ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విచారణకు హాజరుకావడం లేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. లేనియెడల మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. 2018లో మహేష్‌చంద్ర మిశ్రా అనే వ్యక్తి రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version