బెండకాయలో మన శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక అంశాలున్నాయి. బెండకాయ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి.అయితే బెండకాయ నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మందికి రక్తహీనత అనే వ్యాధి వలన రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. అలాంటివారు నానబెట్టిన బెండకాయ వాటర్ తీసుకోవడం వలన రెడ్ సెల్స్ పుష్కలంగా అభివృద్ధి చెందుతాయి.తద్వారా శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ శాతం ఉత్పత్తి అవుతుంది.
బెండకాయ నీరు దగ్గు, గొంతు నొప్పులు తగ్గించేందుకు సమర్దవంతంగా ఉపయోగపడుతుంది.వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడే గొంతు నొప్పి, గొంతు వాపు, దగ్గు,గొంతులో దురద వంటి సమస్యలను బెండకాయలో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.
ఈ మధ్యకాలంలో చక్కర వ్యాధి బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బెండకాయలో ఇన్సులిన్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి చక్కెర వ్యాధిని నియంత్రించడానికి తోడ్పడుతాయి.నానబెట్టిన బెండకాయ నీటిని తీసుకోవడం వలన రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గించుకోవచ్చు.
అతిసారాన్ని నియంత్రించడంలో కూడా ఈ వాటర్ సహాయపడుతుంది. అతిసారం వలన శరీరంలోంచి నీరు అధికంగా బయటకు పోతుంది. అందువల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతోంది. నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
బెండకాయ నీటిలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా గుండె పోటు వంటి సమస్యలను నివారించుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవచు. బెండకాయ రక్తస్థాయిలను కూడా క్రమబద్దీకరిస్తుంది.