ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలలో బట్టతల కూడా ఒకటి. చాలా మంది బట్టతల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్టతలని కవర్ చేసుకోవడానికి టోపీ వంటివి పెట్టుకుంటూ ఉంటారు. మీకు కూడా బట్టతల ఉందా…? బట్టతల మూలంగా ఎక్కడికి వెళ్లడం లేదా..? అయితే కచ్చితంగా మీరు ఈ చిట్కా ని ట్రై చేయాలి. గురువింద బాగా పనిచేస్తుంది.
గురివింద ఆకు రసం తీసుకుని మీరు బట్టతల సమస్య నుండి బయట పడొచ్చు. అయితే గురివిందలో రకరకాలు ఉంటాయి. పైగా ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. గురివింద వలన చాలా లాభాలు ఉంటాయి వాటికోసం ఇప్పుడు చూద్దాం.
దురద వంటివి తొలగిపోతాయి:
గురివింద దురదలని దూరం చేస్తుంది చర్మ రోగాలని కూడా ఇది దూరం చేస్తుంది గురివింద క్రిమి రోగాలని కూడా తగ్గిస్తుంది.
వెంట్రుకలు మొలుస్తాయి:
బట్టతలతో బాధపడే వాళ్ళు గురువింద ఆకు రసాన్ని తీసుకుని తలకి పట్టిస్తే వెంట్రుకలకు క్రమంగా మొలుస్తాయి.
రాలనొప్పి దూరం:
కుంకుడుకాయ రసం తీసుకుని దానితో పాటు మీరు గురువిందలని అరగ తీసి ఆ రసాన్ని తలకి పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది.
పేరుకొరుకుడు ఉండదు:
తేనెతోపాటుగా గురువిందలని మెత్తగా నూరి పేరు కొరికిన చోట రుద్దితే సమస్య తగ్గుతుంది వెంట్రుకలు వస్తాయి.
దగ్గు:
దగ్గుతో బాధపడే వాళ్ళు ఈ గింజలు ఆకుల చూర్ణాన్ని తీసుకుని ఎంత చూర్ణాన్ని తీసుకుంటే అంత పంచదారని కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. అయితే గురివింద విషతుల్యమైనది కాబట్టి డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిది. రిస్క్ చేయకండి.