అతిబల మొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

-

అతిబల మొక్క మానవులకి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరంలాంటిది. ఈ మొక్కలో అనేక రకములైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మానవుని ఆరోగ్య విషయంలో ఎంతగానో దోహదపడతాయి. అతిబల మొక్కలో 1000 రోగాలను నయం చేసే శక్తి దాగి ఉంది. సకల రోగాలకు ఒక్కటే బ్రహ్మాస్త్రం అది అతిబల మొక్క మాత్రమే. అతిబల మొక్క గడిచిన 10 ఏళ్ళుగా క్యాన్సర్ వ్యాధిపై సమున్నత పోరాటం చేస్తూ అనేకమంది క్యాన్సర్ రోగులకు జీవితాన్ని పొడిగించడంలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుంది. అతిబలను అడవి బెండకాయ, ముద్ర బెండ లేదా తుత్తూరు బెండ అంటారు. ఈ చెట్టుని దువ్వెన చెట్టు లేదా మధ్వ చెట్టు అని కూడా అంటారు.


ఈ అతిబల చెట్టు గుండెకు మరియు నరాలకు, కిడ్నీలకు, కాలేయ మరియు కాన్సర్ సంబంధిత వ్యాధులకు ఇంకా అనేకరకములైన వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది. ఈ అతిబల ఆకు అచ్చమ్ చూడడానికి రావి చెట్టు ఆకులానే ఉంటుంది. కానీ వీటి అంచులు రంపపు పళ్ళను పోలి ఉంటాయి. వీటి ఆకులు పసుపు గాను, కాయలు అశోక చక్రం ఆకారంలోనూ ఉంటాయి. వీటి గింజలు చిక్కడు గింజలు ఆకారంలో ఊదా రంగులో ఉంటాయి. అతిబల మొక్క అత్యంత బలమైన ఆకు. అతిబల మొక్కలో అన్ని భాగాలు వైద్యానికి సంబంధించినవే అని నిపుణులు చెప్తున్నారు. ఈ అతిబల మొక్కను వేడి నీళ్లలో మరిగించి తయారుచేసిన కషాయాన్ని తీసుకోవడం వలన అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఈ మొక్క కషాయన్ని డయాలసిస్ మరియు కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు కనుక ప్రతిరోజు తీసుకోవడం వలన చక్కటి పరిష్కారం లభిస్తుంది.మహిళల్లో అనేక రకములైన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్, పిసిఒడి,హార్మోనల్ ఇంబాలన్సెస్, ఎండోమెట్రియాసిస్ వీర్యకణాల లోపo ఉన్నారు ప్రతిరోజు ఈ కషాయాన్ని తీసుకోవడం వలన మంచి పరిస్కారం లభిస్తుంది. పక్షవాతం మరియు నరాల బలహీనత,ఫిట్స్ ఉన్న వారిలో తనదైన పాత్ర చక్కగా పోషిస్తుంది.సోరియాసిస్, డ్రై ఎగ్జిమా,బుల్లి వంటి చర్మవ్యాధులకు అతిబల ఎంతగానో ఉపకరిస్తుంది.ఆస్తమా,నిమోనియా, జలుబు లాంటి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ అతిబల కషాయం చక్కటి పరిష్కారం అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version