జీవన శైలిలో మార్పుల వలన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. వాటిలో రక్తపోటు కూడా ఒకటి. శరీరంలో రక్తపోటు ఎక్కువ అవ్వడం మరియు తక్కువ అవ్వడం అనారోగ్యకరమే. ఎవరైతే తక్కువ రక్తపోటుతో బాధపడుతుంటారో తలతిరగడం, నీరసం, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా అటువంటి సమయంలో ఆకలి తగ్గిపోతుంది, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ముఖ్యంగా హృదయ స్పందన వేగంగా మారుతుంది మరియు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇటువంటి లక్షణాలను ఎదుర్కొన్నప్పుడు, కచ్చితంగా మంచి నీరును తాగుతూ ఉండాలి.
ఇలా చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మరియు తక్కువ రక్త ప్రసరణకు సంబంధించిన లక్షణాలు తగ్గుతాయి. కొంతమంది అకస్మాత్తుగా తక్కువ రక్తపోటును ఎదుర్కొంటారు. అటువంటి సమయంలో మంచి నీటిలో ఉప్పు మరియు పంచదారను కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వలన రక్తపోటు అదుపులోకి వస్తుంది, దీంతో శరీరం ఉత్సాహంగా మారుతుంది. ఎవరైతే తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారో, వారికి మంచి నిద్ర ఎంతో అవసరం. ముఖ్యంగా విశ్రాంతి సమయాన్ని సరైన విధంగా గడపాలి. ప్రతి రోజు బ్లాక్ కాఫీ తీసుకోవడం వలన రక్తపోటు సమస్యను తగ్గించవచ్చు.
లో బీపీ సమస్యతో భాధపడేవారు సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. అయితే ఇది తక్కువ రక్తపోటుతో బాధపడేవారికి మాత్రమే వర్తిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు తక్కువ సోడియం తీసుకోవాలి. అంతేకాకుండా శారీరక వ్యాయామాల పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు, యోగా ఆసనాలు చేస్తారో ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. కనుక జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ తరచుగా డాక్టర్ ను సంప్రదించి సరైన మెడికేషన్ ను పొందాలి. ఇటువంటి చర్యలు తీసుకుంటే మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.